తగ్గిన ఎల్‌పిజి సిలెండర్ ధర..

సబ్సిడీయేతర గ్యాస్ ఎల్‌పిజి సిలిండర్‌ ధర రూ.62.50 మేర తగ్గింది. తాజాగా నిర్ణయించిన ధరలు గురువారం నుంచి అమల్లోకి రావడంతో ప్రస్తుతం ఉన్న ధరకు రూ.62.50 తగ్గినట్టయింది. జులై నెలలో సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ.100.50 తగ్గింది. ఆగస్టు 1 నుంచి 14.2 కేజీల బరువు ఉండే సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.62.50 తగ్గగా, ముంబై, చైన్నైలలో అది రూ.62గా ఉంది. గత రెండు నెలల్లో మొత్తం ధరలో రూ.163 వరకు తగ్గుదల కనిపించినట్టు ఐఓసీ పేర్కొంది. […]

తగ్గిన  ఎల్‌పిజి సిలెండర్ ధర..

Edited By:

Updated on: Aug 02, 2019 | 8:40 AM

సబ్సిడీయేతర గ్యాస్ ఎల్‌పిజి సిలిండర్‌ ధర రూ.62.50 మేర తగ్గింది. తాజాగా నిర్ణయించిన ధరలు గురువారం నుంచి అమల్లోకి రావడంతో ప్రస్తుతం ఉన్న ధరకు రూ.62.50 తగ్గినట్టయింది. జులై నెలలో సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ.100.50 తగ్గింది. ఆగస్టు 1 నుంచి 14.2 కేజీల బరువు ఉండే సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.62.50 తగ్గగా, ముంబై, చైన్నైలలో అది రూ.62గా ఉంది. గత రెండు నెలల్లో మొత్తం ధరలో రూ.163 వరకు తగ్గుదల కనిపించినట్టు ఐఓసీ పేర్కొంది. ఎల్‌పిజి ధరలను ఇకపై ప్రతినెలా సమీక్షించనున్నారు. అంతర్జాతీయంగా ధరల తగ్గుదల ప్రభావం వల్ల సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.