AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు..తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులకు స్లాట్ బుకింగ్ నిలిపివేత..

తెలంగాణ సర్కార్  మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది. ధరణిపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతుండటం.. స్లాట్స్‌ బుకింగ్‌ కూడా నిలిపివేయమని ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు..తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులకు స్లాట్ బుకింగ్ నిలిపివేత..
Sanjay Kasula
|

Updated on: Dec 19, 2020 | 6:52 PM

Share

తెలంగాణ సర్కార్  మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది. ముందస్తు స్లాట్ బుకింగ్‌లు కూడా రద్దు చేస్తున్నట్టు CS సోమేష్‌ కుమార్ కార్యాలయం తెలిపింది. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకుని ఉంటే.. వారికి కేటాయించిన తేదీల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు.

హైకోర్ట్‌ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు చేసింది సర్కార్‌. ఎవరికీ, ఎలాంటి ఇబ్బంది కలగకూడదనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ధరణిపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతుండటం..దీంతో స్లాట్స్‌ బుకింగ్‌ కూడా నిలిపివేయమని ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సోమవారం నుంచి కార్డ్‌ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరగాల్సిన సీఎం సమావేశం రేపటికి వాయిదా పడింది. ఇంతకుముందు రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల స్లాట్‌ బుకింగ్‌ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి యధావిథిగా రిజిస్టేషన్‌లు చేసుకోవచ్చిన ఉత్తర్వుల్లో తెలిపింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్లాట్ బుకింగ్‌లు నిలిపివేసున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 21న రిజిస్ట్రేషన్‌లను పాత పద్ధతిలోనే జరుగనున్నాయి.

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ధరణి విషయంలో సర్కార్‌ తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తోందని మండిపడింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్‌, కులం, వ్యక్తిగత వివరాలను నమోదు చేయబోమన్న హామీని ఎందుకు ఉల్లంఘించారో తెలపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

యువకుడి దారుణ హత్య.. నిందితుడిని పట్టించిన ఇన్‌స్టా రీల్..!
యువకుడి దారుణ హత్య.. నిందితుడిని పట్టించిన ఇన్‌స్టా రీల్..!
పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ టీమ్.. ?
పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ టీమ్.. ?
నా ఉద్దేశం అది కాదు.. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..
నా ఉద్దేశం అది కాదు.. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?