
No Reduction In Intermediate Syllabus: లాక్‌డౌన్ నేపధ్యంలో 2020-21 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు 30 శాతం సిలబస్ కుదిస్తుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చింది. ఇంటర్ సిలబస్‌ను తగ్గించే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇంటర్ విద్యార్ధులకు 30 శాతం ఆన్లైన్ క్లాసులు, 70 శాతం ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లు సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పాఠశాలల పునఃప్రారంభంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న ఆమె.. ఇంజనీరింగ్ తరగతులను ఆగష్టు 17 నుంచి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు.
Also Read:
ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..
వారికి వయోపరిమితి పెంపు.. సీఎం కేసీఆర్ వరాలు..
హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్.. కారణమదే..!
సచివాలయాల్లో ఆధార్ సేవలు.. జగన్ సర్కార్ మరో సంచలనం!
సుశాంత్ ఆత్మతో మాట్లాడిన హుఫ్ పారానార్మల్.. షాకిస్తున్న వీడియో..!
జేఈఈ అడ్వాన్స్‌డ్ .. ఇంటర్‌లో 75% మార్కుల నిబంధన తొలిగింపు..