కొత్త రకం వైరస్‌తో భయపడాల్సిన పనిలేదు.. కేంద్రం అప్రమత్తంగా ఉందన్న ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

|

Dec 21, 2020 | 3:58 PM

బ్రిటన్‌లో వెలుగుచూస్తున్న కొత్త రకం కరోనా పట్ల భయపడాల్సిన పనిలేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

కొత్త రకం వైరస్‌తో భయపడాల్సిన పనిలేదు.. కేంద్రం అప్రమత్తంగా ఉందన్న ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్
Follow us on

బ్రిటన్‌లో వెలుగుచూస్తున్న కొత్త రకం కరోనా పట్ల భయపడాల్సిన పనిలేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. మహమ్మారిపై భారత ప్రజలు పోరాటం ప్రపంచానికే ఆదర్శమని మంత్రి వెల్లడించారు. భారత్‌లో ఈ వైరస్ ప్రబలే అవకాశాలు తక్కువని ఆయన అన్నారు. ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌ 2020 ప్రారంభాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు, బ్రిటన్‌ నుంచి వచ్చే అన్ని విమానాల్ని వెంటనే రద్దు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్త రకం వైరస్‌ వేగంగా వ్యాపిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ వైరస్‌, దాని పుట్టుక, వ్యాప్తిపై చర్చించేందుకుగాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన పరిధిలోని సంయుక్త పర్యవేక్షణ బృందం భేటీని అత్యవసరంగా ఏర్పాటుచేసింది. ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ అధ్యక్షతన సమావేశమైంది.

బ్రిటన్‌లో బయటపడుతున్న కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ గుబులు పుట్టిస్తోంది. ఈ వైరస్ అడ్డూ అదుపూ లేకుండా వేగంగా విస్తరిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల హెచ్చరించింది. దీంతో ఆ దేశంలో ప్రధాన ప్రాంతాల్లో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించింది. అటు ఇటలీలోనూ కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చింది. దీంతో బెల్జియం, నెదర్లాండ్స్‌తోపాటు ఐరోపా దేశాలన్ని మరోసారి అప్రమత్తమయ్యాయి. ఇక బ్రిటన్ నుంచి వచ్చే అన్ని విమాన సర్వీసులను ప్రపంచ దేశాలన్ని రద్దు చేసుకున్నాయి.

కొత్త రకం వైరస్‌తో భయపడాల్సిన పనిలేదు.. కేంద్రం అప్రమత్తంగా ఉందన్న ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్