అరుదైన ఘట్టాలను ప్రదర్శిస్తున్న గూగుల్ డూడుల్.. ఒకేరోజు కనువిందు చేయనున్న రెండు ఖగోళ వింతలు..

గూగుల్ సంస్థ డూడుల్ అరుదైన ఘట్టాన్ని ప్రదర్శిస్తోంది. ఇవాళ ఆకాశంలో గురు, శని గ్రహాల మహాసంయోగం జరుగుతున్న నేపథ్యంలో

అరుదైన ఘట్టాలను ప్రదర్శిస్తున్న గూగుల్ డూడుల్.. ఒకేరోజు కనువిందు చేయనున్న రెండు ఖగోళ వింతలు..
Follow us

|

Updated on: Dec 21, 2020 | 3:28 PM

గూగుల్ సంస్థ డూడుల్ అరుదైన ఘట్టాన్ని ప్రదర్శిస్తోంది. ఇవాళ ఆకాశంలో గురు, శని గ్రహాల మహాసంయోగం జరుగుతున్న నేపథ్యంలో డూడుల్ దీనిని ప్రదర్శించడానికి ముందుకొచ్చింది. అయితే ఇదో రోజు తక్కువ పగలు, ఎక్కువ రాత్రిగా ఉంటుంది. ఇటువంటి సందర్భం సంవత్సరంలో ఒకసారి మాత్రమే వస్తోంది. దీనిని అయనాంతం అంటారు. ఇది కూడా సోమవారం మహాసంయోగం రోజునే వచ్చింది. దీంతో ఈ రెండింటిని కలిపి డూడూల్ ప్రదర్శిస్తోంది.

సోమవారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత గురు-శని గ్రహాలు ఆకాశంలో దగ్గరగా కనిపిస్తాయి. కొందరు దీనిని 2020 క్రిస్మస్‌ నక్షత్రంగా కూడా అంటున్నారు. ఈ రెండు గ్రహాలు ఒక డిగ్రీలో కేవలం పదోవంతు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇటువంటి ఘటన మళ్లీ అరవై ఏళ్ల తర్వాతే ఏర్పడుతుంది అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. గూగుల్ ప్రదర్శిస్తున్న ఈ డూడుల్‌లో యానిమేషన్‌తో చేశారు. అయనాంతం వల్ల ఈ రోజు నుంచి ఉత్తరార్ధగోళంలోని ప్రజలకు పగలు తక్కువగాను, రాత్రి ఎక్కువగాను ఉంటుంది. దక్షిణార్ధగోళంలోని ప్రజలకు దీనికి పూర్తి వ్యతిరేకంగా పగలు ఎక్కువగాను, రాత్రి తక్కువగాను ఉంటుంది.

Latest Articles