లాక్ డౌన్ ఎఫెక్ట్: మాస్కులు ధరించని వారికి నిత్యావసరాలు బంద్..!

| Edited By:

Apr 14, 2020 | 3:14 PM

కోవిద్-19 మహమ్మారి వ్యాప్తిపై ప్రజల్లో ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో యూపీలోని బలరాంపూర్ జిల్లా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేటప్పుడు

లాక్ డౌన్ ఎఫెక్ట్: మాస్కులు ధరించని వారికి నిత్యావసరాలు బంద్..!
Follow us on

కోవిద్-19 మహమ్మారి వ్యాప్తిపై ప్రజల్లో ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో యూపీలోని బలరాంపూర్ జిల్లా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేటప్పుడు మాస్కులు ధరించని పక్షంలో వారికి నిత్యావసరాలు విక్రయించ వద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే బలరాంపూర్ అధికార యంత్రాంగం జిల్లాలోని దుకాణదారులందరికీ ఆదేశాలు జారీ చేసింది. మాస్కులు ధరించకుండా వచ్చిన వారికి ఎలాంటి వస్తువులు విక్రయించరాదని స్పష్టం చేసింది.

కాగా.. “కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలో సామాజిక దూరాన్ని కఠినంగా అమలు చేస్తున్నాం. ప్రజలు మాస్క్ ధరించకుండా వస్తే ఏ వస్తువులూ అమ్మకూడదని దుకాణదారులకు ఆదేశాలు వెళ్లాయి. మెడికల్ షాపులు, కిరాణా షాపులు, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, విత్తన షాపులు సహా అన్ని షాపుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం..’’ అని ఎస్పీ దేవరంజన్ వర్మ పేర్కొన్నారు. ఈ ఆదేశాలను అతిక్రమించే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.