అంతర్రాష్ట్ర సర్వీసులు ఇప్పట్లో లేనట్లే..!

|

Aug 21, 2020 | 6:07 PM

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోయాయి. వాటిని తిరిగి ప్రారంభించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు ఇవాళ భేటీ కావాల్సి ఉండగా.. అది కాస్తా ఇప్పుడు వాయిదా పడింది.

అంతర్రాష్ట్ర సర్వీసులు ఇప్పట్లో లేనట్లే..!
Follow us on

AP And Telangana Inter State Services: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోయాయి. వాటిని తిరిగి ప్రారంభించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు ఇవాళ భేటీ కావాల్సి ఉండగా.. అది కాస్తా ఇప్పుడు వాయిదా పడింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు జూన్‌లో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తెలంగాణకు 256 బస్సు సర్వీసులను తిప్పుతామని ఏపీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది.

దీనితో హైదరాబాద్‌లో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. అయితే హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో కరోనా కేసులు నమోదు కావడం, పలు అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం తరుచుగా వాయిదా పడుతూ వస్తోంది. కాగా, అన్ లాక్ 3.0 ఆగష్టు 30తో పూర్తి కానుండగా.. వచ్చే వారం టీఎస్ఆర్టీసీ అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి తెలంగాణకు ఎన్ని బస్సు సర్వీసులు తిప్పాలి.. అలాగే తెలంగాణ నుంచి ఏపీకి ఎన్ని సర్వీసులు తిప్పాలన్న విషయాలను చర్చించి అధికారులు ఒప్పందం చేసుకోవాల్సి ఉంది.

Also Read:

”భారత్‌లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం”

కరోనా సోకినట్లయితే.. మొదటిగా కనిపించే లక్షణం ఇదే..!

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..