నిర్భయ కేసు: రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం వినయ్ శర్మ పిటిషన్!

నిర్భయ అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ ఘోర నేరానికి పాల్పడిన మరో వ్యక్తి ఇప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్ దాఖలు చేశారు. “వినయ్ శర్మ భారత రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం పిటిషన్ దాఖలు చేశారు” అని అతని న్యాయవాది ఎపి సింగ్ ఈ రోజు ధృవీకరించారు. 26 ఏళ్ల ఈ యువకుడితో పాటు ముకేశ్ సింగ్, అక్షయ్ సింగ్, పవన్ గుప్తా అనే ముగ్గురిని […]

నిర్భయ కేసు: రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం వినయ్ శర్మ పిటిషన్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 29, 2020 | 8:06 PM

నిర్భయ అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ ఘోర నేరానికి పాల్పడిన మరో వ్యక్తి ఇప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్ దాఖలు చేశారు. “వినయ్ శర్మ భారత రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం పిటిషన్ దాఖలు చేశారు” అని అతని న్యాయవాది ఎపి సింగ్ ఈ రోజు ధృవీకరించారు.

26 ఏళ్ల ఈ యువకుడితో పాటు ముకేశ్ సింగ్, అక్షయ్ సింగ్, పవన్ గుప్తా అనే ముగ్గురిని శనివారం ఉరితీయాల్సి ఉంది. అయితే, అక్షయ్ సింగ్ ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో, ఉరి ఇంకా ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు.

నిర్భయ కేసు 2012 లో దేశ రాజధానిలో ఒక వైద్య విద్యార్థి అత్యాచారం, హత్యకు సంబంధించినది. దోషుల్లో ఒకరు జైలులో మరణించగా, మరొకరు బాల్యదశ కారణంగా విడుదల చేయబడ్డాడు. మిగిలిన నలుగురికి మరణశిక్ష విధించబడింది. ఏదేమైనా, ఉరిశిక్షను అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది బాధితురాలి తల్లిదండ్రులను నిరాశకు గురిచేసింది.

“కోర్టు, రాష్ట్రపతికి సమర్పించే ఈ పిటిషన్లు ఉరిశిక్షను ఆలస్యం చేయడానికి వ్యూహాలు మాత్రమే అని, అవి సమయం వృధా చేయడానికే పనికొస్తున్నాయని, దోషులందరినీ ఫిబ్రవరి 1 న ఉరితీయాలి” అని బాధితురాలి తల్లి ఆశా దేవి ఉన్నత కోర్టును ఆశ్రయించారు.