గనుల రంగంలో సమూల మార్పులు – నిర్మలా సీతారామన్

| Edited By:

Oct 18, 2020 | 8:19 PM

గనుల రంగంలో సరళీకృత వ్యాపార విధానాలు తీసుకువస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మైనింగ్ లీజుల విషయంలో విధించే స్టాంప్ డ్యూటీలను క్రమబద్ధీకరిస్తామన్నారు. పాక్షింకంగా వినియోగించుకున్న గనులను ఇతరులకు బదిలీ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. బొగ్గు ఉత్పత్తికి కొత్తగా 500 బ్లాకులు అందుబాటులోకి తెస్తామన్నారు. గతంలో బొగ్గు, విధ్యుత్ సరఫరా లేక చాలా కంపెనీలు వెనుతిరిగాయన్న మంత్రి.. ఇకపై గనుల కొరత లేకుండా చూస్తామన్నారు. బాక్సైట్ బొగ్గు రెండూ కలిపి కేటాంపులు చేస్తామన్నారు. దీంతో భారీగా […]

గనుల రంగంలో సమూల మార్పులు - నిర్మలా సీతారామన్
Follow us on

గనుల రంగంలో సరళీకృత వ్యాపార విధానాలు తీసుకువస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
మైనింగ్ లీజుల విషయంలో విధించే స్టాంప్ డ్యూటీలను క్రమబద్ధీకరిస్తామన్నారు. పాక్షింకంగా వినియోగించుకున్న గనులను ఇతరులకు బదిలీ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. బొగ్గు ఉత్పత్తికి కొత్తగా 500 బ్లాకులు అందుబాటులోకి తెస్తామన్నారు. గతంలో బొగ్గు, విధ్యుత్ సరఫరా లేక చాలా కంపెనీలు వెనుతిరిగాయన్న మంత్రి.. ఇకపై గనుల కొరత లేకుండా చూస్తామన్నారు. బాక్సైట్ బొగ్గు రెండూ కలిపి కేటాంపులు చేస్తామన్నారు. దీంతో భారీగా పెట్టుబడులకు అవకాశం ఉంటుందన్నారు. ఇకపై బొగ్గు బాక్సైట్ కి సంబంధించిన వేలాన్ని సంయుక్తంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు