సోమవారం గవర్నర్‌ను కలవనున్న నిమ్మగడ్డ

|

Jul 18, 2020 | 7:08 PM

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఏపీ గవర్నర్ అపాయింట్‌మెంట్ లభించింది. సోమవారం ఉదయం 11.30 గంటలకు కలిసేందుకు రమేష్‌ కుమార్‌కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను అనుమతి ఇచ్చారు. గవర్నర్‌ను కలిసి రమేష్ కుమార్ వినతిపత్రం సమర్పించనున్నారు. హైకోర్టు సూచన తర్వాత నిమ్మగడ్డ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరగా.. రాజ్‌భవన్ ఖాయం చేసింది. తనను ఎస్ఈసీగా నియమించకపోవడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచాణ జరిపిన కోర్టు.. తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించినా […]

సోమవారం గవర్నర్‌ను కలవనున్న నిమ్మగడ్డ
Follow us on

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఏపీ గవర్నర్ అపాయింట్‌మెంట్ లభించింది. సోమవారం ఉదయం 11.30 గంటలకు కలిసేందుకు రమేష్‌ కుమార్‌కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను అనుమతి ఇచ్చారు. గవర్నర్‌ను కలిసి రమేష్ కుమార్ వినతిపత్రం సమర్పించనున్నారు. హైకోర్టు సూచన తర్వాత నిమ్మగడ్డ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరగా.. రాజ్‌భవన్ ఖాయం చేసింది.

తనను ఎస్ఈసీగా నియమించకపోవడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచాణ జరిపిన కోర్టు.. తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించినా నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏపీ హైకోర్టు నిమ్మగడ్డకు కీలక సూచనలు చేసింది. గవర్నర్‌ను కలవాలని నిమ్మగడ్డను ఆదేశించింది.. వినతిపత్రం ఇవ్వాలని సూచించింది.