స్టాక్ మార్కెట్లో బుల్ రన్!

| Edited By:

Jun 03, 2019 | 6:25 PM

భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లకు కోత విధించ వచ్చునన్న అంచనాలతో భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ తొలిసారి 40 వేల మార్కును దాటింది. నిఫ్టీ సైతం 12 వేల మార్కును తాకింది. నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మందగించినప్పటికీ… క్రూడాయిల్ ధరల్లో తగ్గుదల, రూపాయి బలపడడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 553 పాయింట్లు (1.4 […]

స్టాక్ మార్కెట్లో బుల్ రన్!
Follow us on

భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లకు కోత విధించ వచ్చునన్న అంచనాలతో భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ తొలిసారి 40 వేల మార్కును దాటింది. నిఫ్టీ సైతం 12 వేల మార్కును తాకింది. నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మందగించినప్పటికీ… క్రూడాయిల్ ధరల్లో తగ్గుదల, రూపాయి బలపడడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 553 పాయింట్లు (1.4 శాతం) బలపడి 40,268 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 166 పాయింట్ల మేర ఎగసి 12,089 వద్ద క్లోజ్ అయ్యింది. ఆటో, మెటల్, ఫైనాన్సియల్ సహా అన్ని రంగాల సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి.