గూఢచర్యం కేసులో మరో కీలక సూత్రధారి అరెస్ట్..!

తూర్పు నౌకాదళ స్థావరం గూఢచర్యం కేసులో కీలక సూత్రధారిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. నావికా దళ సమాచారాన్ని చేరవేసేందుకు నిధులు సమకూర్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

గూఢచర్యం కేసులో మరో కీలక సూత్రధారి అరెస్ట్..!

Updated on: Jun 06, 2020 | 9:23 PM

విశాఖ గూఢచర్యం కేసు మరో మలపు తిరిగింది. తూర్పు నౌకాదళ స్థావరం గూఢచర్యం కేసులో కీలక సూత్రధారిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. నావికా దళ సమాచారాన్ని చేరవేసేందుకు నిధులు సమకూర్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ముంబైలో నివాసం ఉంటున్న అబ్దుల్‌ రెహ్మాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన అధికారులు విచారణ చేపట్టారు. ఇదే కేసుకు సంబంధించి అతని భార్య ఖైజర్‌ను గతంలోనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి ఇంట్లో నుంచి సాంకేతిక పరికరాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. తూర్పు నౌకాదళ స్థావరానికి సంబంధించిన ఆధారాలను ఐఎస్ఐఎస్ కి సమాచారం ఇచ్చారన్న ఆరోపణలతో ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధం ఉన్న 11 మంది నావికా దళ సిబ్బందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. గత నెల ఈ సీక్రెట్ ఆపరేషన్ సూత్రధారి మహమ్మద్ హాజీని అరెస్ట్ చేశారు. తాజా అరెస్ట్ తో మొత్తం 15 మందిని అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ అధికారులు విచారణ ముమ్మరం చేశారు