కర్ణాటక ప్రభుత్వానికి రూ.10 లక్షలు జరిమానా: ఎన్‌జీటీ

| Edited By:

Jun 21, 2020 | 8:29 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) రూ.10 లక్షలు

కర్ణాటక ప్రభుత్వానికి రూ.10 లక్షలు జరిమానా: ఎన్‌జీటీ
Follow us on

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) రూ.10 లక్షలు తాత్కాలిక జరిమానా విధించింది. అదేవిధంగా, విధి నిర్వహణలో విఫలమైన బొమ్మసంద్ర పురపాలక సంఘానికి రూ.5 లక్షలు జరిమానా విధింది. బెంగళూరు శివారు ప్రాంతం బొమ్మసంద్ర సమీపంలోని కిత్తిగనహళి సరస్సు కలుషితమవకుండా నిరోధించడంలో విఫలమైనందుకు ఈ చర్య తీసుకుంది. చెరువులు, సరస్సులు వంటివాటిలోకి కాలుష్య కారకాలను విడుదల చేయడాన్ని ఆపకుండా అధికారులు నేరానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

తప్పు చేసిన అధికారుల నుండి ఈ మొత్తాన్ని తిరిగి పొందటానికి రాష్ట్రానికి మరియు మునిసిపల్ కౌన్సిల్‌కు తెరిచి ఉంటుందని ట్రిబ్యునల్ తెలిపింది.పర్యావరణం, ప్రజారోగ్యాలను పణంగా పెట్టి, ముఖ్యమైన రాజ్యాంగ బాధ్యతను నిర్వహించడంలో పురపాలక సంఘం విఫలమవడం, ఈ ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ధిక్కరించడం, చాలా దురదృష్టకరమని తెలిపింది. దీనికి పరిహార చర్యలను కచ్చితంగా తీసుకోవాలని, తప్పు చేసిన అధికారుల జవాబుదారీతనాన్ని నిర్థరించాలని పేర్కొంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.