కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బీజేపీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆపార్టీ అడుగులు వేస్తోంది. గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించాలని కోరనున్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు బీజేపీ ప్రతినిధులు ఢిల్లీకి పయనమవుతున్నారు. కర్నాటక పరిణామాలపై బీజేపీ పక్షనేత యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపే సత్తా తమ పార్టీకే ఉందన్నారు. స్పీకర్ తన బాధ్యతను నెరవేర్చారని, ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు యడ్యూరప్ప.