అయోధ్యకు ఎయిర్‌పోర్ట్..!

| Edited By:

Aug 05, 2020 | 10:46 AM

అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని మోదీ ఇవాళ శంకుస్థాపన చేయనుండగా.. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. రామ మందిర

అయోధ్యకు ఎయిర్‌పోర్ట్..!
Follow us on

అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు ఇంటిముందు రంగవల్లులతో, విద్యుత్ దీపాలతో అలంకరణలు చేశారు. రామ భక్తులు, అఖాడాల సాధువులు రాముడి పాటలతో తన్మయత్వంతో మునిగితేలుతున్నారు. అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని మోదీ ఇవాళ శంకుస్థాపన చేయనుండగా.. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. రామ మందిర నిర్మాణంతో అయోధ్యకు భక్తుల తాకిడి పెరగనుంది. ఈ నేపథ్యంలో నగర ఆధునికీకరణకు యోగి సర్కార్ రూ.500 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. అత్యాధునిక విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ తో పాటు రూ.250 కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. రూ.54 కోట్లతో తాగునీటి సరఫరా పథకాన్ని మెరుగుపరచనున్నారు. అయోధ్యను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సీఎం యోగి పలు కార్యక్రమాలు చేపట్టారు. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని మూడున్నర ఏళ్లలో పూర్తి చేయనున్నారు. ఒకేసారి 10 వేల మంది భక్తులు రామయ్యను దర్శించుకునేలా, ఆలయ ప్రాంగణంలో దాదాపు లక్ష మంది భక్తులు ప్రార్థనలు చేసుకునేలా రూపకల్పన చేయనున్నారు.

Read More:

మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా.. అయోధ్య..!

గుడ్ న్యూస్: 1167 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్