కంగనకు తాప్సీ మరో కౌంటర్…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, తాప్సీ మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. సోషల్‌మీడియా వేదికగా పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా కంగనకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ వీడియోను..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, తాప్సీ మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. సోషల్‌మీడియా వేదికగా పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా కంగనకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ వీడియోను పోస్ట్ చేసి చురకలంటించింది తాప్సీ. 2010లో కంగన.. స్టార్ నటుల వారసుల పట్ల తన అభిప్రాయం తెలుపుతూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వీడియోను తాప్సీ పోస్ట్ చేసింది.
ఈ ఇంటర్వ్యూలో కంగన.. తన ఫ్యామిలీ నేపథ్యం గురించి తెలిపింది. తన తండ్రి బిజినెస్ మ్యాన్, తల్లి ఉపాధ్యాయురాలు, తాత ఐఏఎస్ ఆఫీసర్, ముత్తాత స్వాతంత్య్ర సమరయోధుడు అంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు తనకు ప్రత్యేకమైన కోటా ఉంటుందని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు అదే మాటను తనదైన తరహాలో చురకలు అంటించింది తాప్సి. వారసత్వ నటనను ఇందులో మిక్స్ చేసింది. అలానే ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్‌కు కూడా కోటా ఉంటుందని చెప్పింది. అయితే దీనిపై స్పందించిన తాప్సీ.. “ఓ అయితే ప్రతి చోట ఇటువంటి సిస్టమ్ ఉంటుందన్న మాట, ఇంకేం కథ ముగిసింది. అంటూ సెటైర్ వేసింది.
Ooooooooh. Saara kasoor yeh quota system ka hai! Chalo this was simple to understand . Ho gaya solve. Simple. All good now in our ‘territory’ or their ‘territory’ matlab jiski bhi hai aap samajh jao yaar. https://t.co/hPiOixDWi5
— taapsee pannu (@taapsee) July 21, 2020