Nayanthara : ఆ సినిమాలో నయనతార నటించడంలేదు.. పుకార్లు నమ్మకండి.. క్లారిటీ ఇచిన టీమ్

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతుంది. ఇటు తెలుగు అటు తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్న నయన్ ఇటీవల మలయాళ సినిమాలోనూ..

Nayanthara : ఆ సినిమాలో నయనతార నటించడంలేదు.. పుకార్లు నమ్మకండి.. క్లారిటీ ఇచిన టీమ్

Updated on: Dec 30, 2020 | 7:19 PM

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతుంది. ఇటు తెలుగు అటు తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్న నయన్ ఇటీవల మలయాళ సినిమాలోనూ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న నయన్ త్వరలో ఓ బయోపిక్ లో నటించబోతుందని వార్తలు చెక్కారు కొడుతున్నాయి. తమిళ వీర నారి రాణీ వేలు నచియార్ బయోపిక్ లో నయనతార నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో కోలీవుడ్ ప్రజలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నయనతార పీఆర్ టీమ్ స్పందించింది. రాణీ వేలు నచియార్ బయోపిక్ లో నయనతార నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని వారు అన్నారు. నయన్  వద్దకు అలాంటి ప్రాజెక్ట్ ఏమీ రాలేదు. అసలు అలాంటి పీరియాడిక్ మూవీస్ కూడా ఆమె చేయడం లేదని ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని ఏదైనా సినిమా ఉంటే నయనతార స్వయంగా ప్రకటిస్తుందని, పుకార్లను నమ్మవద్దంటూ ఆమె టీం పేర్కొంది.

Also read:

Upasana Tweet About Mother Cycling: వైరల్‌గా మారిన ఉపాసాన ట్వీట్.. 60 ఏళ్ల వయసులో సైకిల్‌పై 600 కి.మీలు..