తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నరసింహ రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా చేసిన టెస్టుల్లో ఆయనకు కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత వారం నాయిని కరోనా బారినపడ్డారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా సోకిందని తనను కలిసివారంతా పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్‌లోకి వెళ్లాలని ఆయన సూచించారు. అయితే ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్టు నిన్న వార్తలు వచ్చాయి. దీంతో చికిత్స పొందుతోన్న ఆస్పత్రిలోనే ఇంటెన్సివ్ కేర్‌కు తరలించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనకు కరోనా నెగిటివ్ అని నిర్ధారణ కావడం కాస్త ఊరటనిచ్చే విషయం.
కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఈ వైరస్‌కు బాధితులవుతున్నారు. ఇప్పటికే అనేకమంది ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే కొందరు వ్యాధిపై పోరాటం చేసి విజయవంతంగా కోలుకోగా… కొందరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ( రైతులకు అలెర్ట్ : పీఎం కిసాన్ స్కీమ్ డబ్బు పడకపోతే ఇలా చేయండి ! )