నవరాత్రి ఉత్సవాలు… లలితా త్రిపుర సుందరిగా జగన్మాత!
విజయవాడలోని దుర్గా మల్లేశ్వరసామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బుధవారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన జగన్మాత.. గురువారం లలితా త్రిపుర సుందరీదేవిగా అనుగ్రహిస్తున్నారు. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. […]
విజయవాడలోని దుర్గా మల్లేశ్వరసామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బుధవారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన జగన్మాత.. గురువారం లలితా త్రిపుర సుందరీదేవిగా అనుగ్రహిస్తున్నారు. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది.
లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. ‘ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం, బింబాధరం పృథులమౌక్తిక శోభినాసమ్; ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం, మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్!’శ్లోకంతో స్మరించాలి. లలితా దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది. నైవేద్యంగా దద్ద్యోజనం సమర్పించుకుంటారు.