పాక్ ‘వక్ర మ్యాప్’, మాస్కో మీటింగ్ నుంచి అజిత్ దోవల్ వాకౌట్

రష్యా రాజధాని మాస్కోలో ఇటీవల జరిగిన షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాకిస్తాన్ తన వక్ర బుధ్దిని చాటుకుంది. ఇండియాకు చెందిన భూభాగాలను తనవిగా చెప్పుకుంటూ ఇందుకు అనువుగా తప్పుడు మ్యాప్ ను ప్రదర్శించింది. ఇందుకు నిరసనగా..

పాక్ వక్ర మ్యాప్, మాస్కో మీటింగ్ నుంచి  అజిత్ దోవల్ వాకౌట్

Edited By:

Updated on: Sep 16, 2020 | 12:33 PM

రష్యా రాజధాని మాస్కోలో ఇటీవల జరిగిన షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాకిస్తాన్ తన వక్ర బుధ్దిని చాటుకుంది. ఇండియాకు చెందిన భూభాగాలను తనవిగా చెప్పుకుంటూ ఇందుకు అనువుగా తప్పుడు మ్యాప్ ను ప్రదర్శించింది. ఇందుకు నిరసనగా సమావేశం నుంచి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వాకౌట్ చేశారని భారత విదేశాంగశాఖ అధికారప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు. ఇది యథేఛ్చగా నిబంధనలను పాక్  ఉల్లంఘించడమే అని ఆరోపించారు. ఆ దేశం కావాలనే ఈ ‘దొంగ మ్యాప్’ ను ప్రదర్శించిందన్నారు. జమ్మూ కాశ్మీర్, లడాఖ్, గుజరాత్ లోని సర్ క్రీక్ భూభాగాలు మావే అంటూ పాకిస్థాన్ ఈ మ్యాప్ ను చూపిందని, ఆ దేశ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.