దాదాపు 30 ఏళ్ల తర్వాత కూడా.. లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’ సినిమాకు అరుదైన గుర్తింపు లభించింది. కర్తవ్యం సినిమా 1990లో విడుదలైంది. ఈ సినిమాకి ఎ మోహన గాంధీ దర్శకత్వం వహించగా.. సూర్య మూవీస్ పతాకంపై ఎ.ఎం రత్నం నిర్మించారు. ఇందులో విజయశాంతి, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ నిజాయితీ గల పోలీసు అధికారిణి.. అంగబలం, అర్థబలం కలిగిన రౌడీలను ఎలా ఎదుర్కొన్నదీ ఈ చిత్ర కథాంశం.
ఇందులో విజయశాంతి అద్భుతంగా నటించారు. ఈ చిత్రం కమర్షియల్‌గానే కాకుండా అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇందులో నటించినందుకు విజయశాంతికి ‘జాతీయ ఉత్తమనటి’ అవార్డుతో పాటు ‘ఫిలింఫేర్, నంది’ అవార్డులు లభించాయి. కాగా.. ఇప్పటికీ ఈ సినిమా విడుదలై మూడు దశాబ్దాలు గడిచాయి. అయినా కూడా ఈ చిత్రానికి ఇప్పుడు అరుదైన గుర్తింపు లభించింది. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేషనల్ ఫిలిం ఆర్కివ్స్ ఆఫ్ ఇండియా(ఎన్ఎఫ్ఐ) ఈ చిత్రం మొక్క తెలుగు, హిందీ పోస్టర్స్‌ను’ రిలీజ్ చేసింది.
తెలుగులో ‘కర్తవ్యం’ సినిమా 1990లో రిలీజ్ కాగా.. హిందీలో ‘తేజస్విని’ పేరుతో రీమేక్ చేశారు. హిందీలోనూ ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తరువాత తమిళంలో కూడా రిలీజై అఖండ విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ.. ‘కర్తవ్యం సినిమా పోస్టర్స్‌ను ఎన్ఎఫ్ఐ’ ట్వీట్ చేయడం తెలుగు సినిమాకు దక్కిన మరో అరుదైన గుర్తింపుగా భావించాలి. దీనికి విజయశాంతి కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారట.
On #WomensDay today, revisit popular #Telugu female cop film #Kartavyam (1990), starring #Vijayashanthi in the leading role. Winning #NationalAward for her portrayal of super-cop, she also reprised her role in its #Hindi remake #Tejasvini (1994).#महिलादिवस pic.twitter.com/cPAwa7vfRu
— NFAI (@NFAIOfficial) March 8, 2020
ఇది కూడా చదవండి: ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు.. వీలునామా రద్దు చేయించిన తమ్ముడు! కారణమేంటంటే?
ఇది కూడా చదవండి: అసలు టార్గెట్ దొరబాబు కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే!