అంతరిక్షంలో ఫస్ట్ క్రైమ్ … నాసాకు సవాల్ !

|

Aug 25, 2019 | 12:18 PM

భూమ్మీదే కాదు.. అంతరిక్షం లోనూ నేరాలు జరగనున్నాయా ? ఆశ్చర్యకరంగా ఇలాంటి వాస్తవమొకటి వెలుగులోకి వచ్చింది. వ్యోమగాముల్లోనూ క్రిమినల్స్ ఉన్నారనే విషయం తెలిసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. తన మాజీ భర్త వ్యోమగామి కూడా అయిన సమ్మర్ వొర్దాన్ బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసి అతని ఆర్థిక లావాదేవీలన్నీ అవగతం చేసుకుందని ఏస్ట్రోనట్ యాన్ మెక్ క్లెయిన్ పై ఆరోపణలు వచ్చాయి. నాసా కంప్యూటర్ల సాయంతో ఆమె సమ్మర్ బ్యాంక్ ఖాతాల వివరాలను తెలుసుకుందని నాసాకు ఫిర్యాదులు అందాయి. […]

అంతరిక్షంలో ఫస్ట్ క్రైమ్ ... నాసాకు సవాల్ !
Follow us on

భూమ్మీదే కాదు.. అంతరిక్షం లోనూ నేరాలు జరగనున్నాయా ? ఆశ్చర్యకరంగా ఇలాంటి వాస్తవమొకటి వెలుగులోకి వచ్చింది. వ్యోమగాముల్లోనూ క్రిమినల్స్ ఉన్నారనే విషయం తెలిసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. తన మాజీ భర్త వ్యోమగామి కూడా అయిన సమ్మర్ వొర్దాన్ బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసి అతని ఆర్థిక లావాదేవీలన్నీ అవగతం చేసుకుందని ఏస్ట్రోనట్ యాన్ మెక్ క్లెయిన్ పై ఆరోపణలు వచ్చాయి. నాసా కంప్యూటర్ల సాయంతో ఆమె సమ్మర్ బ్యాంక్ ఖాతాల వివరాలను తెలుసుకుందని నాసాకు ఫిర్యాదులు అందాయి. ఇందుకు ఓ కారణం ఉంది. వొర్దాన్ తో తాను రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు తమకు పుట్టిన మగబిడ్డ పోషణకోసమే అని మెక్ క్లైన్ అంటోంది. వీళ్ళిద్దరూ గతంలో కొంతకాలం కలిసి ఉండి ఆ తరువాత విడిపోయారు. అయితే మాజీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా అయిన
వొర్దాన్.. క్లైన్ పై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ లో ఫిర్యాదు చేశారు. తాము విడిపోయినప్పటికీ ఆమె విచ్ఛల విడిగా డబ్బు ఖర్చుపెడుతోందని ఆయన ఆరోపించాడు. ఎలా ఈ సొమ్ము ఖర్చు చేస్తోందో తెలుసుకోగోరుతున్నానన్నాడు. అటు-ఇతని తలిదండ్రులు కూడా నాసాలోని ఐజీ కార్యాలయంలో కంప్లయింట్ చేశారు. మరోవైపు.. తన నేరాన్ని నిందితురాలు అంగీకరించడం విశేషం. తాము సహజీవనం చేస్తున్నప్పుడు తాను వాడిన పాస్ వర్డ్ నే ఆ తరువాత కూడా వాడుతూ వచ్చాననీ, తన బ్యాంకు ఖాతాను తెరవవద్దని వొర్దాన్ తనను ఎప్పుడూ కోరలేదని ఆమె తెలిపింది. అటు-వీరి ఆరోపణల వైనాన్ని నాసా విచారిస్తోంది.