మాల్దీవుల్లో మోదీకి అపూర్వ స్వాగతం!

| Edited By:

Jun 08, 2019 | 6:21 PM

ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులకు చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మాలే చేరుకున్న మోదీకి మాలే విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి అబ్దుల్ షాహిద్ సహా పలువురు ప్రముఖులు సాదర స్వాగతం పలికారు. ప్రధాని తన మొదటి ఐదు సంవత్సరాల పాలనలో పలు విదేశీ పర్యటనలు చేసినప్పటికీ పొరుగు దేశమైన […]

మాల్దీవుల్లో మోదీకి అపూర్వ స్వాగతం!
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులకు చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మాలే చేరుకున్న మోదీకి మాలే విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి అబ్దుల్ షాహిద్ సహా పలువురు ప్రముఖులు సాదర స్వాగతం పలికారు. ప్రధాని తన మొదటి ఐదు సంవత్సరాల పాలనలో పలు విదేశీ పర్యటనలు చేసినప్పటికీ పొరుగు దేశమైన మాల్దీవుల్లో పర్యటించలేదు. ఈ నేపథ్యంలో ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టగానే తొలుత మాల్దీవుల్లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మాల్దీవుల పర్యటలో భాగంగా ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ‘రూల్ ఆఫ్ నిషాన్ ఐజుద్దీన్’‌ పురస్కారాన్ని మోదీ అందుకోనున్నారు. కాగా, శనివారంనాడు మాలే చేరుకున్న మోదీకి రిపబ్లిక్ స్క్వేర్‌ వద్ద మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహ్మద్ సోలిహ్ స్వాగతం పలికారు. మాల్దీవుల పర్యటనలో భాగంగా సోలిహ్, ఉపాధ్యక్షుడు ఫైజల్ నసీమ్, మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్‌లను కలుసుకుంటారు. హిందూ మహాసముద్రం భద్రత, తీరప్రాంత సహకారం పటిష్టతపై ప్రధాని ప్రధానంగా దృష్టిసారించనున్నారు. తీరప్రాంత నిఘా రాడార్ సిస్టమ్‌ను ప్రారంభిస్తారు.