హిస్టరీ క్రియేట్ చేస్తాం – మోదీ

|

May 17, 2019 | 5:36 PM

దేశంలో చరిత్రాత్మక తీర్పు రాబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీ రెండోసారి పూర్తి మెజార్టీ సాధించబోతోందని తెలిపారు. ఈసారి ప్రచారం అద్భుతంగా సాగిందని.. ఐదేళ్లలో ప్రజలకు మంచి పరిపాలన అందించామన్నారు. ప్రజల ఆశీస్సులు మరోసారి ఉంటాయని ఆశిస్తున్నానని తెలిపారు. ఇకపోతే సాద్వి ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని.. గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలతో మేం విభేదిస్తున్నాం అని మోదీ అన్నారు. […]

హిస్టరీ క్రియేట్ చేస్తాం - మోదీ
Follow us on

దేశంలో చరిత్రాత్మక తీర్పు రాబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీ రెండోసారి పూర్తి మెజార్టీ సాధించబోతోందని తెలిపారు. ఈసారి ప్రచారం అద్భుతంగా సాగిందని.. ఐదేళ్లలో ప్రజలకు మంచి పరిపాలన అందించామన్నారు. ప్రజల ఆశీస్సులు మరోసారి ఉంటాయని ఆశిస్తున్నానని తెలిపారు. ఇకపోతే సాద్వి ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని.. గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలతో మేం విభేదిస్తున్నాం అని మోదీ అన్నారు. ఐదేళ్ల క్రిందట ప్రజలు ఇదే రోజున గొప్ప ఫలితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అదే పునరావృతం అవుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

కాగా గతంలో కంటే తమ పార్టీకి ఈసారి భారీ మెజార్టీ వస్తుందని.. మరోసారి మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. మా పార్టీ ఎన్నికల ప్రచారానికి జనం నుంచి మంచి స్పందన వచ్చిందని.. ప్రజలు బీజేపీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఆయన అన్నారు. లక్షా ఆరువేల శక్తి కేంద్రాల ద్వారా పార్టీ బలోపేతం జరిగిందన్నారు. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడంలో బీజేపీ విజయం సాధించిందని తెలిపారు. ధరల పెరుగుదల, అవినీతిపై విపక్షాలు వేలెత్తి చూపలేకపోయాయన్నారు. జనవరి నుంచి ప్రచారాన్ని ప్రారంభించామని.. ఇప్పటివరకూ బీజేపీ గెలవని చోట కూడా ఈసారి గెలుపు తధ్యమనేలా ప్రజలు బ్రహ్మరధం పట్టారని ఆయన అన్నారు. మోదీ ప్రయోగమే విజయవంతమైంది. సంకీర్ణన కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం కాదని అమిత్ షా పేర్కొన్నారు.