భర్త, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి భార్య ఆత్మహత్య

మహారాష్ట్రలో దారుణం జరిగింది. జీవితంపై విర‌క్తితో భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌లకు విషమిచ్చి చంపింది ఓ మ‌హిళా డాక్ట‌ర్‌. అనంత‌రం తానూ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద‌క‌ర సంఘ‌ట‌న నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

భర్త, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి భార్య ఆత్మహత్య

Updated on: Aug 19, 2020 | 11:25 AM

మహారాష్ట్రలో దారుణం జరిగింది. జీవితంపై విర‌క్తితో భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌లకు విషమిచ్చి చంపింది ఓ మ‌హిళా డాక్ట‌ర్‌. అనంత‌రం తానూ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద‌క‌ర సంఘ‌ట‌న నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. 41 ఏళ్ల డాక్ట‌ర్ సుష్మా రాణే త‌న భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌లు, అత్త‌‌తో క‌లిసి నాగ్‌పూర్‌లోని ఓమ్‌న‌గ‌ర్‌లో నివాసం ఉంటుంది. ఆమె భ‌ర్త ధీర‌జ్ ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా మానసిక వేధనకు గురవుతోంది డాక్టర్. త‌న భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మంగ‌ళ‌‌వారం రాత్రి మత్తు మందు క‌లిపిన ఆహారం పెట్టింది. అదితిన్న కుటుంబసభ్యలు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లారు. త‌ర్వాత వారికి గుర్తుతెలియ‌ని ఇంజెక్ష‌న్లు ఇచ్చిందని పోలీసులు గుర్తించారు. దీంతో ముగ్గురు చ‌నిపోయారు. అనంత‌రం ఆమె కూడా ఫ్యాన్‌ను ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్మ చేసుకున్న‌ద‌ని కొరాడీ పోలీసులు వెల్ల‌డించారు.

బుధవారం తెల్ల‌వారిన త‌ర్వాత ఎంత‌కూ వారు గ‌దిలో నుంచి బ‌య‌టికి రాక‌పోవ‌డంతో సుష్మా రాణే అత్త‌ డోర్ కొట్టి చూసింద‌ని, అయినా వారు త‌లుపు తీయ‌క‌పోవ‌డంతో పోలీసుల‌కు స‌మాచారం అందించార‌ు. దీంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్‌‌తోపాటు రెండు సిరంజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‌