
జనసేన ముఖ్య నాయకుడు, నటుడు నాగబాబు చంద్రబాబును పొగిడేశారు. ముఖ్యమంత్రి జగన్ కంటే చంద్రబాబే ‘ఆ’ విషయంలో బెటర్ అన్నారు. చంద్రబాబు, జగన్‌లను పోలుస్తూ నాగబాబు మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో నాగబాబు గురువారం మీడియాతో మాట్లాడారు.
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని నాగబాబు ఆకాంక్షించారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంతో పవన్ కల్యాణ్.. బీజేపీతో జతకట్టారని నాగబాబు చెప్పుకొచ్చారు. వైకాపా ప్రభుత్వం ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అర్ధం కాని పరిస్థితి నెలకొందని నాగబాబు ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వం వున్నపుడు చంద్రబాబు చేసే పని ముందుగానే తెలిసేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమి చేస్తున్నారో ఎవరికీ అంతుచిక్కని విధంగా వుందని వ్యాఖ్యానించారు నాగబాబు. ప్రభుత్వ పరంగా ఏదైనా చేసే ముందు దానికి సంబంధించిన వివరాలను అనుభవఙ్ఞులతో చర్చించి, తగిన విధంగా నిర్ణయం తీసుకోవడం పరిపాటని నాగబాబు అన్నారు. ఈ విధంగా చేయడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కంటే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత మేరకు బెటరని నాగబాబు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో రహదారులు చాలా అధ్వానంగా ఉన్నాయని నాగబాబు ఆరోపించారు. జగన్ ఎప్పుడు ఏమి రద్దు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని నాగబాబు కామెంట్ చేశారు.