రాజధాని గ్రామాలకు వెళ్లి తీరుతాం.. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం: నాగబాబు

| Edited By:

Jan 20, 2020 | 10:05 PM

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన కేసులో అరెస్టయిన రైతులు, మహిళలను పరామర్శించేందుకు జనసేన నేత రాజధాని గ్రామాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. పర్యటనకు వెళ్లొద్దంటూ పోలీసులు అడ్డుకోవడంతో.. జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. పవన్‌ బయటకు వస్తే అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం. అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంపై నాగబాబు తీవ్రంగా మండిపడ్డారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద నాగబాబు మాట్లాడుతూ..రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆందోళనకారులపై […]

రాజధాని గ్రామాలకు వెళ్లి తీరుతాం.. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం: నాగబాబు
Follow us on

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన కేసులో అరెస్టయిన రైతులు, మహిళలను పరామర్శించేందుకు జనసేన నేత రాజధాని గ్రామాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. పర్యటనకు వెళ్లొద్దంటూ పోలీసులు అడ్డుకోవడంతో.. జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. పవన్‌ బయటకు వస్తే అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం.

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంపై నాగబాబు తీవ్రంగా మండిపడ్డారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద నాగబాబు మాట్లాడుతూ..రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆందోళనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరు గర్హణీయం అన్నారు. మహిళా రైతులపై దాడి చేయడం ప్రభుత్వం చేసిన తప్పు అని దుయ్యబట్టారు.