Photo leak : నాగచైతన్య ‘థాంక్యూ’ మూవీనుంచి ఫోటో లీక్… హాకీ ప్లేయర్ గా కనిపించనున్న అక్కినేని యంగ్ హీరో

యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు...

Photo leak : నాగచైతన్య థాంక్యూ మూవీనుంచి ఫోటో లీక్... హాకీ ప్లేయర్ గా కనిపించనున్న అక్కినేని యంగ్ హీరో

Updated on: Dec 30, 2020 | 4:31 PM

Naga Chaitanya ‘Thank You’ movie : యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ సినిమాలో ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇద్దరు డ్యాన్సర్ల జీవనవిధానాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు శేఖర్ కమ్ముల. ఇక ఈ సినిమా చైతన్య, సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడనున్నారని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.

తాజాగా ఈ సినిమానుంచి ఒక ఫోటో లీక్  అయ్యింది. లీక్ అయిన ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫొటోలో చైతన్య హాకీ స్టిక్ పట్టుకొని కనిపిస్తున్నాడు. నాగచైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. గతంలో ‘మజిలీ’ సినిమాలో క్రికెటర్ గా కనిపించి మెప్పించాడు చైతన్య. ఇక ‘థాంక్యూ’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తుంది. నాగచైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్లో గతంలో ‘మనం’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్యూటీఫుల్ మెమొరీగా మిగిలిపోయింది. ఇక ‘థాంక్యూ’ సినిమాను శరవేగంగా షూట్ చేస్తున్నాడు విక్రమ్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Also read:

kamal prabudeva together: వెండితెరపై ఇద్దరు హీరోలు.. 21 ఏళ్ల తర్వాత రిపీట్ కానున్న కాంబినేషన్.?