పవన్ పై ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలపై స్పందించిన నాగబాబు .. గట్టిగా సమాధానం చెప్పిన మెగాబ్రదర్

|

Nov 28, 2020 | 9:06 AM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతుంది. నేతలంతా ఒకరి పై ఒకరు మాటల తూటాలు పేల్చుతూ.. కాకపుట్టిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పై నటుడు ప్రకాష్ రాజ్ తన దానిన శైలిలో వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్శంశం అయ్యింది...

పవన్ పై ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలపై స్పందించిన నాగబాబు .. గట్టిగా సమాధానం చెప్పిన మెగాబ్రదర్
Follow us on

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతుంది.నేతలంతా ఒకరి పై ఒకరు మాటల తూటాలు పేల్చుతూ..కాకపుట్టిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పై నటుడు ప్రకాష్ రాజ్ తన దానిన శైలిలో వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్శంశం అయ్యింది. టీవీ9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేసారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి అని పవన్ చెప్పడం జనసేన కార్యాకర్తలతో పాటు తనను కూడా నిరుత్సాహానికి గురి చేసిందని ప్రకాష్ రాజ్ అన్నారు. మీకు జనసేన అనే పార్టీ ఒకటి ఉంది. మీరు మరో నాయకుడివైపు చూడటం ఏంటి? ఆంధ్రాలో మీ ఓట్ షేర్ ఏంటి? బీజేపీ ఓట్ షేర్ ఏంటి? మీరెందుకు వారి(బీజేపీ) భుజం ఎక్కారు?అంటూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది.

ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. రాజకీయాల్లో అనేక సార్లు నిర్ణయాలు మారుతుంటాయి. బట్ ఆ నిర్ణయం వెనక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్‌లో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిదన్నారు. ఇపుడు జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. బీజేపీకి సపోర్ట్ చేయడం వెనక.. విస్తృత ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయనేది మా ఉద్దేశ్యం. ఎవడికి ద్రోహం చేసాడని ప్రతి పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్.. నీ డొల్లతనం ఏంటో సుబ్రహ్మణ్య స్వామి డిబేట్‌లోనే అర్ధమైంది. సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కి నార తీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకుఇంకా గుర్తుంది. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘నీ ఉద్దేశ్యంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించడంలో ఎలాంటి తప్పులేదు. అదే సమయంలో ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు తీసుకుంటే స్వాగతించాలి. విమర్శించడం తప్ప మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏమి చెప్పగలం. బీజేపీ, జనసేన కూటమి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ సత్తా చాటబోతున్నాయి. మీడియా అడిగింది అని ఒళ్ళు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయట వేసుకోకు అంటూ ట్వీట్ చేశారు నాగబాబు.