గుడ్ న్యూస్: కరోనా కట్టడికోసం.. మైలాన్‌ ఔషధం ’డెస్రెం’..

| Edited By:

Jul 07, 2020 | 5:32 AM

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. చాలా దేశాలు ఈ మహమ్మారి కట్టడికోసం వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరంచేశాయి. ఈ క్రమంలో దేశీయ ఫార్మా సంస్థ  మైలాన్‌ కీలక విషయాన్ని

గుడ్ న్యూస్: కరోనా కట్టడికోసం.. మైలాన్‌ ఔషధం ’డెస్రెం’..
Follow us on

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. చాలా దేశాలు ఈ మహమ్మారి కట్టడికోసం వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరంచేశాయి. ఈ క్రమంలో దేశీయ ఫార్మా సంస్థ  మైలాన్‌ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ నెలలోనే రెమ్‌డెసివిర్‌కు తమ జనరిక్‌ వెర్షన్‌  ఔషధాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలో వినియోగానికి  ‘డెస్రెం’  పేరుతో ఈ ఔషధాన్ని విడుదల చేయనున్నట్లు మైలాన్ తెలిపింది.

గిలీడ్ సైన్సెస్ కు చెందిన యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమెడిసివిర్ జనరిక్‌ వెర్షన్‌ డ్రగ్‌ను 100 మిల్లీగ్రాముల డోస్‌కు 4,800 రూపాయలు (64.31డాలర్లు) చొప్పున ఈ నెలలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. ‘డెస్రెం’  పేరుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిందని మైలాన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే సిప్లా లిమిటెడ్, హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ రెమ్‌డెసివిర్‌ జనరిక్‌ వెర్షన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: కర్ణాటకలో అడవుల్లో ‘బగీరా’.. వైరల్ అవుతున్న ఫోటోలు..