దీపికతో బ్రేకప్‌పై రణ్‌బీర్ సెన్సేషనల్ కామెంట్స్

| Edited By:

Apr 25, 2020 | 7:12 PM

బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలారు. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత దీపికా రన్‌వీర్‌ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. అయితే దీనికి కారణంగా రణ్‌బీర్ కపూర్ తల్లి నీతూకపూర్ కారణమని..

దీపికతో బ్రేకప్‌పై రణ్‌బీర్ సెన్సేషనల్ కామెంట్స్
Follow us on

బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలిన విషయం తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత దీపికా రన్‌వీర్‌ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. అయితే దీనికి కారణంగా రణ్‌బీర్ కపూర్ తల్లి నీతూకపూర్ కారణమని చాలా కాలం క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా రణ్‌బీర్ స్పందించాడు. దీపికా, తాను విడిపోవడమనేది తమ వ్యక్తిగతమని అన్నాడు.

దీపిక ఎప్పటికీ నా స్నేహితురాలే. మేమిద్దరం విడిపోవడమనేది మా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ప్రేమ అనేది ఇద్దరు మనుషులకు సంబంధించిన విషయమని నేను నమ్ముతాను. మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం. ఆమె నా వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోదు. ఇంకా చెప్పాలంటే మా పేరెంట్స్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమికులు ఎలా ఉంటారనే విషయం తండ్రితో పాటు తల్లికి కూడా తెలుసన్నారు. ఇక దీపికాతో విడిపోయాననే విషయం ఇప్పుడెందుకు చెబుతున్నానంటే మా బ్రేకప్‌కు మా అమ్మ కారణం కాదనే విషయం చెప్పడానికే ఈ విషయాన్ని చెప్పానన్నారు. కాగా ప్రస్తుతం రణ్‌బీర్ ఆలియా భట్‌తో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే కదా.

Read More: 

లాక్‌డౌన్ ఫ్రస్ట్రేషన్‌ తెలిపితే.. డబ్బులే డబ్బులు!

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

విజయవాడలో నాన్‌-వెజ్ బ్యాన్.. అధికారుల కీలక నిర్ణయం