మన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే.. మైం హోం గ్రూప్ చైర్మన్

| Edited By:

Jul 01, 2019 | 8:31 AM

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిహారికా దొంతనేని భరతనాట్యం అరంగేట్రం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మైహోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు అతిధిగా హాజరయ్యారు. నిహారికకు బాల్యం నుంచి నాట్యం అంటే అమితాసక్తి ఉండేది. దీంతో నిహారికా పేరెంట్స్ దొంతినేని రమ్య, రవీందర్‌లు 9వ ఏట నుంచే ఆమెకు భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత 2011 నుంచి గీతా గణేశన్ దగ్గర శిక్షణ తీసుకుంటోంది. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌లో విద్యాభ్యాసం […]

మన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే.. మైం హోం గ్రూప్ చైర్మన్
Follow us on

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిహారికా దొంతనేని భరతనాట్యం అరంగేట్రం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మైహోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు అతిధిగా హాజరయ్యారు. నిహారికకు బాల్యం నుంచి నాట్యం అంటే అమితాసక్తి ఉండేది. దీంతో నిహారికా పేరెంట్స్ దొంతినేని రమ్య, రవీందర్‌లు 9వ ఏట నుంచే ఆమెకు భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత 2011 నుంచి గీతా గణేశన్ దగ్గర శిక్షణ తీసుకుంటోంది. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసిన నిహారికా, హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసింది. ఈ సందర్భంగా అతిధిగా హాజరైన మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు ప్రసంగించారు. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను రక్షించుకుంటూ.. భావితరాలకు అందిచాల్సిన అవసరం ఉందన్నారు.