నేను కళ్లు తెరిచిందే యుద్ధ భూమిలో…. బయోపిక్‌పై మురళీధరన్ వివరణ
ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే! 800 పేరుతో వస్తున్న ఆ సినిమాలో మురళీధరన్ పాత్రను సుప్రసిద్ధ నటుడు విజయ్ సేతుపతి ధరిస్తున్న సంగతి కూడా తెలిసిన విషయమే! ఆ సినిమా మోషన్ పోస్టర్ వచ్చినప్పటి నుంచి విజయ్‌సేతుపతిపై తమిళనాడుకు చెందిన అనేక రాజకీయపార్టీలు విమర్శలు చేయడం మొదలు పెట్టారు.. మురళీధరన్ పాత్ర చేస్తావా? ఎంత ధైర్యం అని ఆడిపోసుకుంటున్నారు.. చేస్తే తప్పేమిటన్న వారు కూడా […]
ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే! 800 పేరుతో వస్తున్న ఆ సినిమాలో మురళీధరన్ పాత్రను సుప్రసిద్ధ నటుడు విజయ్ సేతుపతి ధరిస్తున్న సంగతి కూడా తెలిసిన విషయమే! ఆ సినిమా మోషన్ పోస్టర్ వచ్చినప్పటి నుంచి విజయ్‌సేతుపతిపై తమిళనాడుకు చెందిన అనేక రాజకీయపార్టీలు విమర్శలు చేయడం మొదలు పెట్టారు.. మురళీధరన్ పాత్ర చేస్తావా? ఎంత ధైర్యం అని ఆడిపోసుకుంటున్నారు.. చేస్తే తప్పేమిటన్న వారు కూడా ఉన్నారు.. నటి రాధిక అయితే సూటిగా ఓ ప్రశ్న వేశారు.. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మురళీధరన్‌ను కోచ్‌గా నియమించుకున్నప్పుడు ఈ గొంతులన్నీ ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు.. ఈ గొడవలన్నీ ఎందుకన్న ఉద్దేశంతో మురళీధరనే స్వయంగా కల్పించుకున్నారు.. వివరణ ఇచ్చుకున్నారు.. ‘జీవితంలో వివాదాలు నాకు కొత్త కాదు.. ఎన్నో వివాదాలు నన్ను సుడిగుండాల్లా చుట్టుముట్టాయి.. ఈ చిత్రం ఎందుకు తీస్తున్నారో.. ఏ ఉద్దేశంతో నా జీవిత చరిత్రను తెరపైకి ఎక్కిస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత నాకుంది.. నేను పుట్టిందే యుద్ధ భూమిలో.. కళ్లు తెరచిననాటి నుంచి యుద్ధ బీభత్సాన్ని చూస్తూ వచ్చాను.. ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు నా తండ్రి చనిపోయాడు. కుటుంబ అవసరాల కోసం అనేక ఇబ్బందులు పడ్డాం.. అంతర్యుద్ధం మా జీవితాలను అస్తవ్యస్తం చేశాయి.. ఈ ఇబ్బందులను ఎలా అధిగమించగలిగాను? క్రికెట్‌లో ఎలా నిలదొక్కగలిగాను? ఎలా విజయం సాదించగలిగాను? అన్నవే ఈ సినిమాలో ప్రధానాంశాలు! శ్రీలంకలో తమిళుడుగా పుట్టడం నా తప్పు కాదు కదా! నేను శ్రీలంక జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాను.. ఆ కారణంగానే నేను కొన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకున్నాను.. ఈ చిత్రంపై అనవసరంగా రాజకీయం అలుముకుంటోంది.. నేను శ్రీలంకలో జరిగిన మారణహోమానికి మద్దతు ఇచ్చానంటూ ఆరోపణలు చేస్తున్నారు.. నేను అవగాహనారాహిత్యంతో కొన్ని మాటలు తప్పుగా మాట్లాడి ఉండవచ్చు.. అవి ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.. నన్ను బాధిస్తూనే ఉన్నాయి.. నాపై విమర్శలకు కారణమవుతూనే ఉన్నాయి. 2009లో అంతర్యుద్ధం ముగిసింది.. జీవితమంతా యుద్ధ సీమలో గడిపినవారికి అదో ఊరట! ఇప్పుడు ఎవరి ప్రాణాలు పోవడం లేదన్న సంతోషం.. నేను ప్రశాంత జీవితం గడపాలనుకుంటున్నా.. తమిళ ప్రజలలో ఆత్మవిశ్వాసం ప్రోది చేయడానికే ఈ జీవిత చరిత్రను సినిమాగా తీయాలనుకుంటున్నా’ అని ఆవేదనతో చెప్పుకొచ్చాడు మురళీధరన్.