
ముంబై పోలీస్ లు చేపట్టిన ‘ఆల్ అవుట్ ఆపరేషన్’ సక్సెస్ ఫుల్ గా సాగింది. డ్రైవ్ మొదలుపెట్టిన కేవలం మూడు గంటల వ్యవధిలో 95 దాడులు జరిపారు పోలీసులు. దాదాపు 80 మందిని అదుపులోకి తీసుకున్నారు. నేరస్థులు, మాదకద్రవ్యాల సరఫరా వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి నగర పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు మొత్తంగా189 ప్రదేశాలలో కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టి 7,562 వాహనాలను తనిఖీ చేశారు. 53 డ్రగ్స్ కేసులు నమోదు చేశారు. నగరంలోని అన్ని పోలీసు స్టేషన్ల నుంచి సీనియర్ పోలీసు అధికారుల నేతృత్వంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మూడు గంటలపాటు కొనసాగిన ఆపరేషన్‌లో తీవ్రమైన నేరాలకు సంబంధించి 362 మంది నేరస్థులను తనిఖీ చేశారు. అలాగే, 851 హోటళ్లు, లాడ్జీలు, ముసాఫిర్ ఖానాలను పోలీసులు తనిఖీ చేశారు.