ఈ నెల 27 నుంచి మాల్స్, రెస్టారెంట్లు 24 గంటలూ ఉంటాయి.. కేబినెట్ ఆమోదం!

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో మళ్ళీ నైట్‌లైఫ్ ప్రారంభం కానుంది. జనవరి 27వ తేదీ నుంచి నగరంలోని అన్ని మాల్స్, మల్టీప్లెక్సులు, హోటళ్లు ఇకపై 24/7 తెరిచి ఉంచేందుకు మహా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని పర్యాటకశాఖ మంత్రి ఆదిత్య థాక్రే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విధానం లండన్‌లో అమలవుతోందని.. దీని వల్ల 5 బిలియన్ పౌండ్ల అదనపు ఆదాయాన్ని కూడా వారు పొందుతున్నారని ఆయన […]

ఈ నెల 27 నుంచి మాల్స్, రెస్టారెంట్లు 24 గంటలూ ఉంటాయి.. కేబినెట్ ఆమోదం!

Edited By:

Updated on: Jan 23, 2020 | 5:29 PM

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో మళ్ళీ నైట్‌లైఫ్ ప్రారంభం కానుంది. జనవరి 27వ తేదీ నుంచి నగరంలోని అన్ని మాల్స్, మల్టీప్లెక్సులు, హోటళ్లు ఇకపై 24/7 తెరిచి ఉంచేందుకు మహా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని పర్యాటకశాఖ మంత్రి ఆదిత్య థాక్రే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విధానం లండన్‌లో అమలవుతోందని.. దీని వల్ల 5 బిలియన్ పౌండ్ల అదనపు ఆదాయాన్ని కూడా వారు పొందుతున్నారని ఆయన అన్నారు.

మొదటి దశలో నివాసేతర ప్రాంతాల్లోని షాపులు, మాల్స్, మల్టీప్లెక్సులు తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇచ్చామని ఆదిత్య థాక్రే తెలిపారు. అయితే అన్నీ కూడా 24 గంటలూ తెరిచి ఉండాల్సిన అవసరం లేదని.. ఎవరైతే నైట్ లైఫ్‌లో తమ వ్యాపారం జరగాలని కోరుకుంటారో వారు మాత్రం తెరుచుకోవచ్చునని ప్రకటించారు. ఇకపోతే ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం వారిపై జీవితకాల నిషేధం తప్పదని హెచ్చరించారు. అయితే పబ్బులు, బార్లు మాత్రం యధావిధిగా అర్ధరాత్రి 1.30 గంటలకే మూతపడతాయని చెప్పారు. కాగా, ఈ నిర్ణయం వల్ల పోలీసులపై ఎలాంటి అదనపు భారం పడదని తేల్చి చెప్పారు.