AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027: రోహిత్ శర్మకు అండగా 4గురు మ్యాచ్ విన్నర్లు.. ముంబై టీం చూస్తే ప్రత్యర్థులకు వణుకే..!

Mumbai Indians IPL 2027: ఐపీఎల్ 2027లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే ఐదు టైటిళ్లు అందించిన హిట్‌మ్యాన్‌కు జట్టులోని కొందరు స్టార్ ఆటగాళ్లు ప్రధాన బలం కానున్నారు. మరి రోహిత్‌కు విజయాలు అందించడంలో కీలకంగా నిలిచిన ఆ నలుగురు మ్యాచ్ విన్నర్లు ఎవరో చూద్దాం.

IPL 2027: రోహిత్ శర్మకు అండగా 4గురు మ్యాచ్ విన్నర్లు.. ముంబై టీం చూస్తే ప్రత్యర్థులకు వణుకే..!
Mumbai Indians Match Winners
Venkata Chari
|

Updated on: Nov 29, 2026 | 10:37 AM

Share

Mumbai Indians Match Winners: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి జట్టు కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. గతంలో ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు రెండోసారి ముంబై జట్టును విజయపథంలో నడిపించేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో కొందరు స్టార్ ప్లేయర్లు మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ఇప్పుడు ఐపీఎల్ 2027లో కూడా వీరే రోహిత్‌కు ప్రధాన ఆయుధాలుగా మారే అవకాశం ఉంది. మరి ఆ నలుగురు ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.

1. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)

రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌కు అత్యంత కీలకమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. తన అద్భుతమైన యార్కర్లు, వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై గెలిచిన మ్యాచ్‌ల్లో బుమ్రా గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి.

ఆడిన మ్యాచ్‌లు: 59

ఇవి కూడా చదవండి

వికెట్లు: 80

బౌలింగ్ సగటు: 19.03

ఎకానమీ: 6.70

స్ట్రైక్ రేట్: 17

ముఖ్యంగా 2020 ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో కేవలం 14 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఢిల్లీని 143 పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

ఎక్కువమంది చదివినది: IND vs NZ: 91 బంతుల్లో 12 పరుగులు.. టెస్టు క్రికెట్‌ హిస్టరీలో చెత్త రికార్డులో టీమిండియా జోడీ..!

2. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ కీలక ఆటగాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో తనదైన 360 డిగ్రీల షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో కీలక సమయాల్లో పరుగులు సాధిస్తూ జట్టుకు విజయాలు అందించాడు.

ఆడిన మ్యాచ్‌లు: 40

పరుగులు: 1,426

బ్యాటింగ్ సగటు: 41.94

స్ట్రైక్ రేట్: 154.32

2023లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సాధించిన సెంచరీ అతడి అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి. రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య.. కేవలం 49 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌తో ముంబై 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. చివరకు గుజరాత్‌ను 191/8కి పరిమితం చేసి విజయం సాధించింది.

3. క్వింటన్ డికాక్ (Quinton de Kock)

దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ కూడా రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌కు కీలక ఆటగాడిగా నిలిచాడు. ఓపెనర్‌గా దూకుడుగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాలు అందించాడు.

ఆడిన మ్యాచ్‌లు: 22

పరుగులు: 662

బ్యాటింగ్ సగటు: 33.10

స్ట్రైక్ రేట్: 135.10

2020లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డికాక్ అజేయంగా 78 పరుగులు చేశాడు. కేవలం 44 బంతుల్లోనే ఈ పరుగులు సాధించాడు. రోహిత్ శర్మతో కలిసి 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో 149 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

ఎక్కువమంది చదివినది: శ్రీలంక సిరీస్‌కు భారత జట్టు.. సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం..!

4. తిలక్ వర్మ (Tilak Varma)

ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ అత్యంత కీలకమైన ఆటగాడు. జట్టులోకి వచ్చిన తొలి రోజుల నుంచే తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడిన మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శన చేశాడు.

ఆడిన మ్యాచ్‌లు: 9

పరుగులు: 270

బ్యాటింగ్ సగటు: 45

స్ట్రైక్ రేట్: 139.17

2022లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. 98 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ అజేయంగా 34 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముంబై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.

ఐపీఎల్ 2027లో రోహిత్‌కు ఈ ఆటగాళ్లే కీలకం..!

ముంబై ఇండియన్స్‌కు ఇప్పటికే ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. బుమ్రా బౌలింగ్, సూర్యకుమార్ దూకుడు, డికాక్ ఓపెనింగ్ సామర్థ్యం, తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్.. ఇవన్నీ రోహిత్‌కు ప్రధాన బలంగా మారవచ్చు.

మరి ఐపీఎల్ 2027లో ఈ ఆటగాళ్లతో కలిసి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు ఆరో టైటిల్ అందిస్తాడో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IPL 2027: రోహిత్‌కు అండగా 4గురు మ్యాచ్ విన్నర్లు..!
IPL 2027: రోహిత్‌కు అండగా 4గురు మ్యాచ్ విన్నర్లు..!
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే వంకాయ కూర! ఇలా చేస్తే అదిరిపోద్ది
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే వంకాయ కూర! ఇలా చేస్తే అదిరిపోద్ది
బొమ్మతో ఆడుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న చిన్నారి..2నెలల తర్వాత
బొమ్మతో ఆడుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న చిన్నారి..2నెలల తర్వాత
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. 90 రోజుల్లోగా..
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. 90 రోజుల్లోగా..
Video: వికెట్ తీసిన ఆనందంలో డ్యాన్స్ చేసిన బుమ్రా..!
Video: వికెట్ తీసిన ఆనందంలో డ్యాన్స్ చేసిన బుమ్రా..!
ఒరేయ్ బావ.. ఎంతపని చేశావురా..! సొంత చెల్లెలు భర్తనే..
ఒరేయ్ బావ.. ఎంతపని చేశావురా..! సొంత చెల్లెలు భర్తనే..
61 ఏళ్ల వయసులోనూ కూల్ హీరోగా కనిపించాలనుకుంటున్నా.. షారుఖ్ ఖాన్..
61 ఏళ్ల వయసులోనూ కూల్ హీరోగా కనిపించాలనుకుంటున్నా.. షారుఖ్ ఖాన్..
తెల్లని నెయ్యి చూస్తే కల్తీ అని అనుకుంటున్నారా? నిపుణులు చెప్పే
తెల్లని నెయ్యి చూస్తే కల్తీ అని అనుకుంటున్నారా? నిపుణులు చెప్పే
మహిళలను కట్టేసి రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడంటే?
మహిళలను కట్టేసి రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడంటే?
అడవుల్లో మావోయిస్ట్‌ల కోసం గాలిస్తుండగా కనిపించిన ఇనుప పెట్టే..
అడవుల్లో మావోయిస్ట్‌ల కోసం గాలిస్తుండగా కనిపించిన ఇనుప పెట్టే..