సూర్య పరిపక్వత కలిగిన ఆటగాడు…

|

Nov 11, 2020 | 1:47 AM

Rohit Sharma Has Praised : ఐపీఎల్-13 సీజన్ టైటిల్ గెలవడంపై ముంబై ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో గెలిచి టైటిల్ డిఫెండ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ గెలుపు క్రెడిట్ తమ వెనుకుండి నడిపించిన సపోర్ట్ స్టాప్‌దేనని స్పష్టం చేశాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఈ సీజన్‌పై దృష్టి సారించామని వెల్లడించాడు. గత సీజన్ లోపాలను సరిచేసుకొని జట్టును […]

సూర్య పరిపక్వత కలిగిన ఆటగాడు...
Follow us on

Rohit Sharma Has Praised : ఐపీఎల్-13 సీజన్ టైటిల్ గెలవడంపై ముంబై ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో గెలిచి టైటిల్ డిఫెండ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ గెలుపు క్రెడిట్ తమ వెనుకుండి నడిపించిన సపోర్ట్ స్టాప్‌దేనని స్పష్టం చేశాడు.

ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఈ సీజన్‌పై దృష్టి సారించామని వెల్లడించాడు. గత సీజన్ లోపాలను సరిచేసుకొని జట్టును బలంగా మార్చుకున్నామని రోహిత్ తెలిపాడు. ఇషాన్, సూర్య కుమార్ యాదవ్‌లో ఆత్మ విశ్వాసం పెంపొందని అన్నాడు. ఇక సూర్య చాలా పరిపక్వత కలిగిన ఆటగాడు అంటూ ప్రశంసించాడు. అతను అద్భుత ఫామ్‌తో చెలరేగాడు. నా తప్పిదం కారణంగా అతను రనౌట్ అయ్యాడు అంటూ అభిప్రాయ పడ్డారు రోహిత్ శర్మ.