రోహిత్ ఖాతాలో సరికొత్త రికార్డు

రోహిత్ ఖాతాలో సరికొత్త రికార్డు

ముంబై ఇండియాన్స్ సారథి రోహిత్ శర్మ సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు.  ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో 200 మ్యాచ్​లు ఆడిన రెండో ఆటగాడిగా రోహిత్​ ఘనత సాధించాడు. దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్​తో ఆడుతున్న ఐపీఎల్...

Sanjay Kasula

|

Nov 11, 2020 | 12:49 AM

Rohit Became Only The Second Player : ముంబై ఇండియాన్స్ సారథి రోహిత్ శర్మ సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు.  ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో 200 మ్యాచ్​లు ఆడిన రెండో ఆటగాడిగా రోహిత్​ ఘనత సాధించాడు. దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్​తో ఆడుతున్న ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​లో ఈ మైలురాయిని రాహుల్ చేరుకున్నాడు.

టోర్నీ ప్రారంభం నుంచి దక్కన్​ ఛార్జర్స్​, ముంబై ఇండియన్స్​ జట్లకు ప్రాతినిధ్యం వహించిన రోహిత్​.. 39 హాఫ్​ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు ముంబై  ఇండియన్స్​ తరపున హిట్​మ్యాన్​కు ఇది 155వ మ్యాచ్​.

ఢిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన లీగు మ్యాచ్​తో రోహిత్​ తన 150వ ఐపీఎల్ మ్యాచ్​ను ఆడాడు. ఐపీఎల్​లో 200 మ్యాచ్​లు పూర్తి చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్​ ధోనీ రికార్డు సృష్టించాడు. ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018 సీజన్లలో విజేతగా నిలిచింది.

ధోనీ ఆడిన 204 ఐపీఎల్​ మ్యాచ్​లలో 4,632 పరుగులను నమోదు చేయగా.. అందులో 23 అర్ధశ తకాలున్నాయి. అత్యధికంగా 84 రన్స్​ చేశాడు ధోనీ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu