ఆ ముగ్గురు ఔట్… కొత్త సెలెక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన
Applications For The Selectors : టీమిండియా సెలెక్టర్ల కమిటీలో మూడు పోస్టుల నియామకానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సెలెక్టర్ల కమిటీలోని ముగ్గురి పదవీకాలం పూర్తవ్వడంతో ఈ ప్రకటన జారీ చేసింది. వీరి ఎంపికకు కొన్ని అర్హతలను ప్రకటించింది. ఆ అర్హతలు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలని కోరింది. నిబంధనల ప్రకారం జాతీయ జట్టు సెలెక్టర్లు కావాలంటే టీమిండియా తరపున కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు లేదా 20 […]
Applications For The Selectors : టీమిండియా సెలెక్టర్ల కమిటీలో మూడు పోస్టుల నియామకానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సెలెక్టర్ల కమిటీలోని ముగ్గురి పదవీకాలం పూర్తవ్వడంతో ఈ ప్రకటన జారీ చేసింది. వీరి ఎంపికకు కొన్ని అర్హతలను ప్రకటించింది. ఆ అర్హతలు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలని కోరింది.
నిబంధనల ప్రకారం జాతీయ జట్టు సెలెక్టర్లు కావాలంటే టీమిండియా తరపున కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు లేదా 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఐదేళ్ల క్రితం రిటైర్ అయ్యి ఉండాలి. 60 ఏళ్లు మించకూడదు అని ప్రకటనలో పేర్కొంది. నవంబరు 15 లోపు ఆశావహులు తమ దరఖాస్తులు సమర్పించాలని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా నియామకం అయ్యే ముగ్గురు కొత్త సెలెక్టర్లు సునీల్ జోషీ నేతృత్వంలోని ప్యానెల్లో భాగంగా ఉంటారు.
సెలెక్షన్ కమిటీలోని సరన్‌దీప్ సింగ్, దేవాంగ్ గాంధీ, జతిన్ పరంజాపే పదవీకాలం ముగిసింది. సరన్‌దీప్, దేవాంగ్, జతిన్ ఈ ముగ్గురు ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసినవారిలో ఉన్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ మ్యాచ్‌లను ఆడనున్నారు.
ఈ ఛాంపియన్షిప్ పట్టికలో అగ్రస్థానంలో భారత్ ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత్ గెలుపొందింది.