DC vs MI, IPL 2024: టాస్ గెలిచిన ముంబై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో ఈరోజు డబుల్ హెడర్ (ఒక రోజులో 2 మ్యాచ్‌లు). ఈ రోజు తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

DC vs MI, IPL 2024: టాస్ గెలిచిన ముంబై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
Dc Vs Mi Toss Update
Follow us

|

Updated on: Apr 27, 2024 | 3:16 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో ఈరోజు డబుల్ హెడర్ (ఒక రోజులో 2 మ్యాచ్‌లు). ఈ రోజు తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండోసారి తలపడనున్నాయి. వాంఖడే వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కాగా, ఇరుజట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబై జట్టు నుంచి గెరాల్డ్ కోయెట్జీ ఈరోజు మ్యాచ్ నుంచి నిష్క్రమించాడు. ల్యూక్ వుడ్‌కు అవకాశం లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పృథ్వీ షా ఆడకపోవడంతో అతని స్థానంలో కుమార్ కుశాగ్రా వచ్చాడు.

ఇవి కూడా చదవండి

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య రెండో మ్యాచ్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది.

పిచ్ నివేదిక..

అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రారంభ ఓవర్లలో కొత్త బంతితో పేసర్లు కూడా కొంత సహాయం పొందవచ్చు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు మొత్తం 86 మ్యాచ్‌లు ఇక్కడ జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 39 మ్యాచ్‌లు గెలవగా, రెండో బ్యాటింగ్ చేసిన జట్టు 46 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 34 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఢిల్లీ 15 గెలుచుకోగా, ముంబై 19 గెలిచింది. అదే సమయంలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్లు 10 సార్లు తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ 6 సార్లు, ఎంఐ 4 సార్లు గెలుపొందాయి.

ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది 10వ మ్యాచ్. 9లో 4 విజయాలు, 5 ఓటములతో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. జట్టులో పంత్ టాప్ స్కోరర్. బౌలింగ్‌లో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా ఆకట్టుకున్నాడు.

ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కుమార్ కుషాగ్రా, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్, కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లిజాద్ విలియమ్స్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, పీయూష్ చావ్లా, ల్యూక్ వుడ్, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.

రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్లు..

ఢిల్లీ క్యాపిటల్స్: రసిఖ్ దార్ సలామ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, రికీ భుయ్, సుమిత్ కుమార్.

ముంబై ఇండియన్స్: సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, షామ్స్ ములానీ, డెవాల్డ్ బ్రీవిస్, కుమార్ కార్తికేయ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పవన్ కళ్యాణ్‎ను దత్తపుత్రుడు అనడానికి కారణం ఇదే.. సీఎం జగన్
పవన్ కళ్యాణ్‎ను దత్తపుత్రుడు అనడానికి కారణం ఇదే.. సీఎం జగన్
తల్లిదండ్రుల చిన్న ఏమరుపాటు ప్రాణాలు కోల్పోయే స్టేజ్‌కి చిన్నారి
తల్లిదండ్రుల చిన్న ఏమరుపాటు ప్రాణాలు కోల్పోయే స్టేజ్‌కి చిన్నారి
తెలంగాణలో వైఎస్ఆర్సీపీ విస్తరణపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తెలంగాణలో వైఎస్ఆర్సీపీ విస్తరణపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
సైడ్ క్యారెక్టర్స్ నుంచి స్టార్ హీరోగా..
సైడ్ క్యారెక్టర్స్ నుంచి స్టార్ హీరోగా..
ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలోకి చూసుకుంటున్నారా..?
ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలోకి చూసుకుంటున్నారా..?
చార్ ధామ్ యాత్రలో ఏ దేవుళ్లను పూజిస్తారు? ప్రాముఖ్యత ఏమిటంటే
చార్ ధామ్ యాత్రలో ఏ దేవుళ్లను పూజిస్తారు? ప్రాముఖ్యత ఏమిటంటే
బంగారం.. మిస్‌ అవుతున్నా! గోల్డెన్ డేస్ ని గుర్తుచేసుకున్న బ్యూటీ
బంగారం.. మిస్‌ అవుతున్నా! గోల్డెన్ డేస్ ని గుర్తుచేసుకున్న బ్యూటీ
నేడు రాయలసీమ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
నేడు రాయలసీమ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
దేవుడిని దూరం నుంచి చూడాలి అనుకోవాలి.. ఇలా కారుతో డైరెక్ట్‌గాకాదు
దేవుడిని దూరం నుంచి చూడాలి అనుకోవాలి.. ఇలా కారుతో డైరెక్ట్‌గాకాదు
బుజ్జితల్లి.. హ్యాపీ బర్త్ డే..
బుజ్జితల్లి.. హ్యాపీ బర్త్ డే..