AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈయన గారి మోసానికి ఇప్పుడే అవకాశం దొరికింది..!

కరోనాతో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఆర్థిక భారాన్ని సైతం లెక్క చేయకుండా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయారు జనం. మరో వైపు దేశంలో ఉన్న లాక్‌డౌన్‌ను కూడా క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పలువురు అక్రమార్కులు. లాక్‌డౌన్‌లో ప్రయాణం చేయాలనుకునే వారి కోసం అక్రమార్కులు ఫేక్‌ ఈ ట్రావెల్‌ పాస్‌లను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ముంబైలోని చెంబూర్‌కు చెందిన 28 ఏళ్ళ యువకుడిని దొంగ పాస్‌ల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది యువకులతో కలిసి […]

ఈయన గారి మోసానికి ఇప్పుడే అవకాశం దొరికింది..!
Balaraju Goud
| Edited By: |

Updated on: May 28, 2020 | 5:32 PM

Share

కరోనాతో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఆర్థిక భారాన్ని సైతం లెక్క చేయకుండా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయారు జనం. మరో వైపు దేశంలో ఉన్న లాక్‌డౌన్‌ను కూడా క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పలువురు అక్రమార్కులు. లాక్‌డౌన్‌లో ప్రయాణం చేయాలనుకునే వారి కోసం అక్రమార్కులు ఫేక్‌ ఈ ట్రావెల్‌ పాస్‌లను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ముంబైలోని చెంబూర్‌కు చెందిన 28 ఏళ్ళ యువకుడిని దొంగ పాస్‌ల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది యువకులతో కలిసి ఫోర్జరీ ట్రావెల్‌ పాస్‌లను తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక్కో పాస్‌కు దాదాపు రూ.5000 లకు పైగా అమ్మకానికి పెట్టారు. ఇది గమనించిన కొందరు దక్షిణ ముంబై ప్రాంతానికి చెందిన డోంగ్రీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముఠా సూత్రదారి మనోజ్‌ రాము హంబేను అరెస్టు చేశారు. నిందితులు దొంగ పాస్‌లను ముంబై, నేవీ ముంబై పోలీసు కమీషనర్లు, ముంబైకి చెందిన పలు కలెక్టర్‌లు జారీ చేసినట్లుగా ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే