AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన జీవిత లక్ష్యాలను వెల్లడించిన ముఖేష్ అంబానీ

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ తన లక్ష్యాన్ని వెల్లడించారు.

తన జీవిత లక్ష్యాలను వెల్లడించిన ముఖేష్ అంబానీ
Balaraju Goud
|

Updated on: Oct 20, 2020 | 9:03 PM

Share

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ తన లక్ష్యాన్ని వెల్లడించారు. రిలయన్స్ ఇటీవలి నెలల్లో విదేశీ పెట్టుబడిదారుల నుండి 25 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులను సాధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ బిలియనీర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, వృద్ధిని పెంచడానికి భారత్ తన తయారీ రంగాన్ని పునర్నిర్వచించాలన్నారు.

“భారతదేశంలో తయారీని పునరాలోచించాల్సిన అవసరం ఉంది. మా చిన్న మరియు మధ్య తరహా సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది” అని అంబానీ సోమవారం సాయంత్రం ఆన్‌లైన్ పుస్తక ఆవిష్కరణలో అన్నారు, భారతీయ తయారీని మరింత పోటీగా మార్చగలదా అనే ప్రశ్నకు సమాధానం

రిటైల్, డిజిటల్ సేవల వైపు తన తండ్రి నుండి వారసత్వంగా పొందిన ముఖేష్ ఇంధన కార్యకలాపాల నుండి ముందుకు వస్తున్న రిలయన్స్, ఇటీవలి నెలల్లో విదేశీ పెట్టుబడిదారుల నుండి 25 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులను పొందారు. అలాగే రిలయన్స్ ఇ-కామర్స్ ప్రణాళికలకు చివరి మైలు మద్దతుగా పనిచేయడానికి చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు, చిన్న  దుకాణాలను భాగస్వామిగా చేసుకోవాలని అంబానీ భావిస్తున్నారు.

తాను వదిలివేయాలనుకుంటున్న వారసత్వం గురించి అడిగినప్పుడు, అంబానీ మూడు రంగాలను వివరించాడు – తన లక్ష్యంలో మూడు అంశాలున్నాయని అంబానీ పేర్కొన్నారు. ఇక ఆయన లక్ష్యాలిలా ఉన్నాయి. మొదటిది… భారతదేశాన్ని ఓ డిజిటల్ వ్యవస్థగా మార్పు చేయడం, రెండవది… అత్యున్నత నైపుణ్యాలను కనబరచే దిశగా దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం, మూడవది… ఇక మూడవది… సాంప్రదాయ ఇంధన వనరుల వాడకం నుంచి భారతదేశాన్ని రెన్యువబుల్ ఎనర్జీని వినియోగించే దిశగా మళ్లించడం. ఈ లక్ష్యాల సాధిన దిశగా తన కృషి కొనసాగుతుందని అంభానీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.