అంతా ఆయన వల్లే.. విజయసాయిరెడ్డి ట్వీట్
అమరావతి రింగ్ రోడ్డు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు యూటర్న్ వల్లే అమరావతి రింగ్ రోడ్డు పనులు ప్రారంభం కాలేదని ఆయన ట్వీట్ చేశారు. ముందు భూసేకరణ తామే చేస్తామన్న చంద్రబాబు తర్వాత చెరిసగం భరించాలని మెలిక పెట్టాడని చెప్పారు. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారని తెలిపారు. విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు […]

అమరావతి రింగ్ రోడ్డు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు యూటర్న్ వల్లే అమరావతి రింగ్ రోడ్డు పనులు ప్రారంభం కాలేదని ఆయన ట్వీట్ చేశారు. ముందు భూసేకరణ తామే చేస్తామన్న చంద్రబాబు తర్వాత చెరిసగం భరించాలని మెలిక పెట్టాడని చెప్పారు. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారని తెలిపారు.
విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు తీసుకున్నయూ-టర్న్ వల్ల పనులు మొదలు కాకుండా పోయాయి. మొదట భూసేకరణ తామే చేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చి తర్వాత చెరిసగం భరించాలని మెలిక పెట్టారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయం వెల్లడించారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 25, 2019



