ఇక్కడ రాములోరి గుడి.. అక్కడ సీతమ్మ వారి ‘ విడిది ‘

అయోధ్యలో రాములవారు ‘వెలిస్తే” శ్రీలంకలో సీతమ్మవారు ‘ విడిది ‘ చేయనున్నారు. యూపీలోని అయోధ్యలో అతి పెద్ద రామాలయ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధపడుతుండగా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా శ్రీలంకలో సీతమ్మ వారి మందిరాన్ని నిర్మించేందుకు పూనుకొంది. ఆ ద్వీపంలో ఈ దేవాలయాన్ని నిర్మిస్తామని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ప్రకటించారు. ఇందులో భాగంగా తమ రాష్ట్ర అధికారులు, శ్రీలంక ప్రభుత్వ అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నిర్దిష్ట కాల […]

ఇక్కడ రాములోరి గుడి.. అక్కడ సీతమ్మ వారి  విడిది

Edited By:

Updated on: Jan 28, 2020 | 5:36 PM

అయోధ్యలో రాములవారు ‘వెలిస్తే” శ్రీలంకలో సీతమ్మవారు ‘ విడిది ‘ చేయనున్నారు. యూపీలోని అయోధ్యలో అతి పెద్ద రామాలయ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధపడుతుండగా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా శ్రీలంకలో సీతమ్మ వారి మందిరాన్ని నిర్మించేందుకు పూనుకొంది. ఆ ద్వీపంలో ఈ దేవాలయాన్ని నిర్మిస్తామని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ప్రకటించారు. ఇందులో భాగంగా తమ రాష్ట్ర అధికారులు, శ్రీలంక ప్రభుత్వ అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నిర్దిష్ట కాల వ్యవధిలోగా అక్కడ ఆలయ నిర్మాణ పనులను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు.

ఈ టెంపుల్ డిజైన్ ని త్వరలో ఖరారు చేయాలని అధికారులను ఆదేశించిన ఆయన.. , ఈ ఆర్ధిక సంవత్సరంలోనే తగినన్ని నిధులను మంజూరు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. శ్రీలంకలోని సాంచీలో ఓ బుధ్ధ మ్యూజియం నిర్మాణాన్ని కూడా చేపడతామన్నారు. , ఇందుకు భూమిని కేటాయించవలసిందిగా అధికారులకు సూచించారు. దీంతో బాటు రీసెర్చ్ , ట్రెయినింగ్ సెంటర్ కూడా ఏర్పాటయ్యేలా చూస్తామని కమల్ నాథ్ శ్రీలంక అధికారులకు చెప్పారు.  అటు- మధ్యప్రదేశ్ కు చెందిన ప్రజాపనుల శాఖ మంత్రి పీసీ శర్మ త్వరలో శ్రీలంకను విజిట్ చేయనున్నారు.