4జీ వచ్చేసింది.. 5జీ వచ్చేస్తోంది.. ఇక 6జీ కోసం ప్రయత్నాలు మొదలైయ్యాయి. 2030 నాటికి జపాన్ 6జి టెక్నాలజీ కోసం సమగ్ర వ్యూహాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. కొత్త టెక్నాలజీ ప్రస్తుత 5జి కన్నా 10 రెట్లు వేగంగా ఉంటుందని తెలుస్తోంది. టోక్యో విశ్వవిద్యాలయం సహకారంతో జనవరిలో జపాన్ అంతర్గత వ్యవహారాల సమాచార మంత్రిత్వ శాఖ ప్రభుత్వ-పౌర పరిశోధనా సంఘాన్ని ఏర్పాటు చేయనుంది. 6జి పనితీరు, లక్ష్యాల గురించి చర్చించడానికి ఎన్‌టిటి, తోషిబా కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమి సహ వ్యవస్థాపకుడు లీ జున్ వచ్చే ఐదేళ్లలో 5 జి, ఎఐ, ఐఒటిలలో 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించారు.