చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళ్యంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి, తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలాజీ కాలనీలో నివాసముంటున్న వెంకటరమణకు గౌతమితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గత కొంత కాలంగా గౌతమికి, వెంకటరమణ మధ్య కలహాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన ఆమె… తన కుమార్తె ధరణి(4), కుమారుడు తోనేశ్వర్(3) సహా చల్లగుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. డెడ్ బాడీలను గమనించిన స్థానిక రైతులు… పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గౌతమి భర్త వెంకటరమణ తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్వోగా పనిచేస్తూ ఇటీవల పదోన్నతి పొందిన్నట్లు తెలుస్తోంది. వెంకట రమణకు ఇద్దరు భార్యలు ఉండటంతో, సమస్యలు మొదలైనట్లుగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు.
Also Read :