డిగ్రీ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్….

|

Apr 27, 2020 | 9:01 AM

కరోనా కారణంగా విద్యార్థులు క్లాసులు విన‌లేక‌పోయినందున డిగ్రీ పరీక్షల్లో మరింత ఛాయిస్‌ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స‌మాలోచ‌న‌లు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అంటే భయపడకుండా ఏం చేయాలన్న దానిపై కసరత్తు జరిపింది. ప్రత్యామ్నాయాలను సూచిస్తున్న మండలి ఫైన‌ల్ డెషిస‌న్ మాత్రం యూనివ‌ర్శిటిల‌కే వదిలివేయనుంది. డిగ్రీ ఫ‌స్ట్, సెకండ్ ఇయ‌ర్ స్టూడెం‌ట్స్  పై సెమిస్టర్లలోకి వెళ్లేందుకు మినిమం క్రెడిట్లు సాధించాలన్న రూల్ ఇప్పటికే ఉంది. దాన్ని ఎత్తివేసి ‘నో డిటెన్షన్‌’ విధానం […]

డిగ్రీ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్....
Follow us on

కరోనా కారణంగా విద్యార్థులు క్లాసులు విన‌లేక‌పోయినందున డిగ్రీ పరీక్షల్లో మరింత ఛాయిస్‌ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స‌మాలోచ‌న‌లు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అంటే భయపడకుండా ఏం చేయాలన్న దానిపై కసరత్తు జరిపింది. ప్రత్యామ్నాయాలను సూచిస్తున్న మండలి ఫైన‌ల్ డెషిస‌న్ మాత్రం యూనివ‌ర్శిటిల‌కే వదిలివేయనుంది.

డిగ్రీ ఫ‌స్ట్, సెకండ్ ఇయ‌ర్ స్టూడెం‌ట్స్  పై సెమిస్టర్లలోకి వెళ్లేందుకు మినిమం క్రెడిట్లు సాధించాలన్న రూల్ ఇప్పటికే ఉంది. దాన్ని ఎత్తివేసి ‘నో డిటెన్షన్‌’ విధానం అమలుచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎగ్జామ్స్ జూన్‌ లేదా జులైలోనే జరిగే ఛాన్స‌స్ ఉన్నందున యూజీసీ కమిటీ సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకొని ఫైన‌ల్ డెషిస‌న్ తీసుకోవాల‌ని భావిస్తున్నారు. ప్రైమ‌రీ లెవ‌ల్ లో రెండు విధానాలపై ఓ క్లారిటీకి వచ్చారు.

అందులో ఒక‌టి ఇప్పటి క్వ‌చ్చ‌న్ పేప‌ర్స్ ఉన్నవాటి కంటే ప్రశ్నల ఛాయిస్‌ పెంచాలని. ఇక రెండోది లాక్‌డౌన్‌ కంటే ముందు పూర్తయిన సిలబస్‌ నుంచే మొత్తం క్వ‌చ్చ‌న్ పేప‌ర్ త‌యారు చెయ్యాల‌ని. దీనివల్ల చదువులో యావ‌రేజ్ స్టూడెంట్స్ సైతం ఇబ్బంది పడకుండా ఎగ్జామ్స్ రాస్తారని అధ్యాప‌కులు అభిప్రాయపడుతున్నారు.