Corona Alert: క‌రోనా కొత్త రూపాలు.. స‌రికొత్త ల‌క్ష‌ణాలు !

ఇప్ప‌టిదాకా ద‌గ్గు, జ్వ‌రం, శ్వాస పీల్చుకోవ‌డంలో ఇబ్బందులు ఉంటే అవి క‌రోనా ల‌క్ష‌ణాలుగా భావిస్తూ వ‌చ్చాం. కాని తాజాగా డాక్ట‌ర్ల అనుభ‌వాల నుంచి మ‌రికొన్ని కొత్త ల‌క్ష‌ణాలు

Corona Alert: క‌రోనా కొత్త రూపాలు.. స‌రికొత్త ల‌క్ష‌ణాలు !
Follow us

|

Updated on: Apr 27, 2020 | 7:18 AM

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ నానాటికీ కొత్త రూపాలు సంత‌రించుకుంటున్న‌కొద్దీ ఆ వ్యాధి ల‌క్ష‌ణాలు కూడా ఒక‌టికి నాలుగు జ‌త అవుతున్నాయి. ఇప్ప‌టిదాకా ద‌గ్గు, జ్వ‌రం, శ్వాస పీల్చుకోవ‌డంలో ఇబ్బందులు ఉంటే అవి క‌రోనా  ల‌క్ష‌ణాలుగా భావిస్తూ వ‌చ్చాం. కాని తాజాగా డాక్ట‌ర్ల అనుభ‌వాల నుంచి మ‌రికొన్ని కొత్త ల‌క్ష‌ణాలు కూడా క‌రోనా వైర‌స్ సోకింద‌న‌డానికి ప్రేర‌కాలుగా నిలుస్తున్నాయి. అమెరికాలోని “ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్” (CDC) అధ్య‌య‌నం ఈ విధంగా వెల్ల‌డించింది.
భ‌రించ‌లేనంతాగా జ‌లుబు చేయ‌డం, చ‌లి, చ‌లితో వ‌ణుకు, కండ‌రాల నొప్పి, త‌ల‌నొప్పి, గొంతు నొప్పి, నాలుక రుచిని కోల్పోవ‌డం, ముక్కు వాస‌న ప‌సిగ‌ట్ట‌లేక‌పోవ‌డం కూడా క‌రోనా ల‌క్ష‌ణాలుగా డాక్ట‌ర్లు చెబుతున్నారు. అంటే మొద‌ట్లో ఉన్న ల‌క్ష‌ణాల క‌న్నా ఇప్పుడు అవి మూడింత‌లు పెరిగాయ‌న్న మాట‌! ఈ ల‌క్ష‌ణాలుంటే రెండు నుంచి ప‌ద్నాలుగు రోజుల్లోప‌ల క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా తేలే అవ‌కాశాలున్నాయ‌ని వ్యాధి నియంత్ర‌ణ‌, నివార‌ణ కేంద్రాల( సీడీసీ) నిపుణులు చెబుతున్నారు.
పైన పేర్కొన్న ల‌క్ష‌ణాల్లో ఎవరికైనా ఏ ఒక్క లక్షణం కనిపించినా… వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇంట్లోనే ఉంటూ… మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ… ఇంట్లో వాళ్లను కూడా దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడాలి. వెంట‌నే వైద్య‌సాయం తీసుకోవాల్సిందిగా వారు హెచ్చ‌రిస్తున్నారు.  ఈ ల‌క్ష‌ణాలేమీ లేక‌పోయినా, కొంద‌రిలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చే అవ‌కాశాలూ ఉన్నాయ‌ని వారు అంటున్నారు. ఉత్త‌ర ఇట‌లీలో ఒక మ‌హిళ‌కు కాళ్ల మీద ద‌ద్దుర్లు వ‌చ్చాయ‌ని, ఆమెకు ప‌రీక్ష‌లు చేస్తే క‌రోనా పాజిట‌వ్ అని తేలింద‌ని డాక్ట‌ర్లు గుర్తు చేస్తున్నారు.అలాగే ఐస్ లాండ్‌లో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేకుండానే ఈ వైర‌స్ సోకిన‌ట్టు వెల్ల‌డైంద‌ని మ‌రికొంద‌రు డాక్ట‌ర్లు గుర్తు చేస్తున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ సామాజిక దూరం, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, మంచి ఆరోగ్య‌వంత‌మైన ఆహారం తీసుకుంటూ..రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకోవ‌టంతో  క‌రోనాను జ‌యించ‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం