AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. జీవిత పాఠం నేర్పే నీతి కథ

Telugu Moral Story: డబ్బు విలువను తెలుసుకోవాలంటే ముందుగా కష్టం విలువను అర్థం చేసుకోవాలి. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి వెనుక ఉన్న శ్రమ తెలిసినప్పుడే పొదుపు చేయడం, బాధ్యతగా ఖర్చు చేయడం అలవాటు అవుతుంది. తండ్రి తన కొడుకుకు నేర్పిన ఈ చిన్న పాఠం, జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన గొప్ప నీతిని తెలియజేస్తుంది. కష్టం, పొదుపు, బాధ్యతలతోనే ఆనందమైన జీవితం సాధ్యమవుతుందని ఈ కథ చక్కగా వివరిస్తుంది.

కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. జీవిత పాఠం నేర్పే నీతి కథ
Savings Moral Story
Janardhan Veluru
|

Updated on: Jul 27, 2026 | 1:33 PM

Share

నీతి కథలు పిల్లలతో పాటు పెద్దలకు నైతిక విలువలు నేర్పుతాయి. ఏది మంచో ఏది చెడో వారికి బాగా అర్థమయ్యేలా నీతి కథలు దోహదపడుతాయి.  ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు వారి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. కానీ అతిగా గారాబం చేయడం వల్ల కొన్నిసార్లు పిల్లలకు డబ్బు విలువ, కష్టం విలువ తెలియకుండా పోతుంది. మనం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి వెనుక ఉన్న శ్రమను అర్థం చేసుకున్నప్పుడే జీవితంలో బాధ్యత పెరుగుతుంది. అలాంటి గొప్ప సందేశాన్ని అందించే ఈ నీతి కథ ప్రతి ఒక్కరికీ జీవిత పాఠాన్ని నేర్పుతుంది.

కథ

ఒక గ్రామంలో ఓ భూస్వామి ఉండేవాడు. ఆయనకు ఎంతో కాలం తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో అతడిని అపారమైన ప్రేమ, గారాబంతో పెంచాడు. ఫలితంగా ఆ అబ్బాయికి కష్టమంటే ఏంటో తెలియలేదు. చదువుపై ఆసక్తి లేకుండా..రోజంతా స్నేహితులతో తిరుగుతూ, తండ్రి సంపాదించిన డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేసేవాడు.

కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందిన ఆ భూస్వామి ఒకరోజు అతడిని పిలిచి ఇలా అన్నాడు -“నా తర్వాత ఈ ఆస్తి అంతా నీదే. కానీ ఈ సంపదను కాపాడుకునే సామర్థ్యం నీకు ఉందో లేదో తెలుసుకోవాలి. నీవు కూడా కష్టపడి డబ్బు సంపాదించగలవని నిరూపిస్తే, నా ఆస్తి అంతా నీ పేరున రాస్తాను.”

ఇవి కూడా చదవండి

తండ్రి మాటలు విన్న కొడుకు ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. చదువు లేకపోవడంతో ఎక్కడా పని దొరకలేదు. చివరకు ఒక మిల్లులో మూటలు మోసే కూలీగా చేరాడు. రోజంతా చెమటోడ్చి పనిచేసి మొదటి రోజు రూ.20 కూలీ సంపాదించాడు. ఆనందంగా ఆ డబ్బును తండ్రి చేతిలో పెట్టాడు. అయితే తండ్రి ఆ డబ్బును తీసుకుని నేరుగా గ్రామంలోని బావిలో పడేశాడు. కొడుకు ఆశ్చర్యపోయినా ఏమీ మాట్లాడలేదు.

రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు కూడా కొడుకు కష్టపడి సంపాదించిన డబ్బును తండ్రి అలాగే బావిలో పడేస్తూనే ఉన్నాడు. అయినా కొడుకు మౌనంగానే ఉన్నాడు. ఐదో రోజు కూడా అదే చేయబోతుండగా, కొడుకు పరుగెత్తుకుంటూ వచ్చి తండ్రి చేతిని పట్టుకుని ఆపేశాడు. “నాన్నా… నేను ఎంత కష్టపడి మూటలు మోసి సంపాదించిన డబ్బు అది. దాన్ని ఎందుకు బావిలో పడేస్తున్నారు?” అని బాధతో అడిగాడు.

కొడుకులో వచ్చిన మార్పును చూసి తండ్రి చిరునవ్వుతో ఇలా అన్నాడు – “నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నీళ్లలో పడిపోతుంటే నీకు ఎంత బాధగా ఉందో చూశావు కదా. నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బును నువ్వు నిర్లక్ష్యంగా ఖర్చు చేసినప్పుడు నాకు కూడా అంతే బాధ కలిగేది. డబ్బు సంపాదించడం చాలా కష్టం… కానీ ఖర్చు చేయడం చాలా సులభం. ఈ విషయం ఇప్పుడు నీకు అర్థమైంది.”

తండ్రి మాటలు కొడుకును పూర్తిగా మార్చేశాయి. తన తప్పును గుర్తించి క్షమాపణ చెప్పాడు. అప్పటి నుంచి అనవసర ఖర్చులు మానేసి, కష్టపడి పనిచేస్తూ పొదుపు చేయడం ప్రారంభించాడు. చివరకు తండ్రి నమ్మకాన్ని గెలుచుకుని బాధ్యతగల వ్యక్తిగా ఎదిగాడు.

నీతి

ఈ కథ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని గుర్తు చేస్తుంది. కష్టపడి సంపాదించిన సంపద విలువ తెలిసినవారే డబ్బును సరిగ్గా ఉపయోగించగలరు. పిల్లలకు డబ్బు ఇవ్వడం కంటే, డబ్బు వెనుక ఉన్న కష్టం గురించి నేర్పడం మరింత అవసరం. దుపు అనేది కేవలం డబ్బు దాచుకోవడం కాదు. అది భవిష్యత్తు కోసం భద్రతను నిర్మించుకోవడం. సంపాదనకు ఎంత ప్రాధాన్యం ఉందో, ఆ సంపాదనను జాగ్రత్తగా ఖర్చు చేయడం, కొంత పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం.

కష్టం విలువ తెలిసినప్పుడే డబ్బు విలువ అర్థమవుతుంది. సంపాదించిన దాన్ని గౌరవించి, పొదుపు చేస్తేనే జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది.

Follow Us
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు!
నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు!
చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? ఇవిగో పూర్తి వివరాలు..
చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? ఇవిగో పూర్తి వివరాలు..
ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్‌, 12 OTT యాప్‌లు
ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్‌, 12 OTT యాప్‌లు
రోజుకు 45 దాచిపెడితే.. 100 ఏళ్ల వరకు ఏటా 40 వేలు.. ఎల్ఐసీ స్కీమ్
రోజుకు 45 దాచిపెడితే.. 100 ఏళ్ల వరకు ఏటా 40 వేలు.. ఎల్ఐసీ స్కీమ్