కోవిడ్ మహమ్మారి సినీ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఓటీటీలో కొన్ని సినిమాలు విడుదలవుతున్నా.. పెద్ద హీరోల సినిమాలు మాత్రం ఏమీ లేవు. అటు ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై గ్లామర్ మిస్ అయ్యిందంటూ ఉసూరుమంటున్నారు. కరోనా కారణంగా గ్లామర్ ఫీల్డ్‌లో ఒకలాంటి స్తబ్ద వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో సినీ విభాగంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే మరోసారి అగ్రస్థానం కేవసం చేసుకుంది. గ్లోబల్ స్టార్ హీరోయిన్స్ కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యా రాయ్, అనుష్క శర్మలను వెనక్కి నెట్టి ఫేమస్ నటిగా నిలిచింది.
ఇండియా టుడే నిర్వహించిన ఈ సర్వేలో దీపికకు 16 శాతం ఓట్లు పడగా.. ప్రియాంక చోప్రాకు 14, కత్రినాకు 13, ఐశ్వర్యా రాయ్‌కు 10, అనుష్క శర్మకు 9 శాతం ఓట్లు పడ్డాయి. ఇక స్టార్ కిడ్ అలియా భట్‌తో పాటు బాలీవుడ్ క్వీన్‌గా పేరొందిన కంగనా రనౌత్ 6 శాతం ఓట్లతో సంయుక్తంగా ఏడో స్థానంలో నిలవడం విశేషం. రామ్‌లీలా, పద్మావత్ తదితర సినిమాలతో అగ్ర కథానాయికగా ఎదిగి అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా దీపికా పేరు గాంచింది. కాగా ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో జతకట్టి టాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టబోతుంది దీపికా.
Read More:
తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న కరోనా.. పెరుగుతోన్న కేసుల సంఖ్య